వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ భవిష్యత్తు ఏంటీ..?.. విజయమ్మ ఆరా...

By SumaBala BukkaFirst Published Oct 14, 2023, 10:15 AM IST
Highlights

వైఎస్ షర్మిల గురించి వైఎస్ విజయమ్మ సిద్ధాంతిని కలిశారు. ఆమె రాజకీయభవిష్యత్తు గురించి ఆరా తీశారు. బీఫాంలు ఎప్పుడివ్వాలో ముహూర్తం కనుక్కున్నారు.  

ఒంగోలు : వైయస్సార్ టీపీకి తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు కుదరకపోవడంతో ఒంటరిగానే బరిలోకి దిగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ శుక్రవారం ఒంగోలుకు వెళ్లారు. అక్కడ  ఓ  ప్రముఖ సిద్ధాంతితో విజయమ్మ సమావేశమయ్యారు. ఒంగోలుకు మధ్యాహ్నం చేరుకున్న ఆమె టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లారు. 

వై వి సుబ్బారెడ్డి తల్లి అనారోగ్యంతో ఉండడంతో.. ఆమెను పరామర్శించారు. ఆ తర్వాత అక్కడి నుంచి సిద్ధాంతి అద్దేపల్లి హనుమంతరావును.. ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఆయన ఇంట్లో దాదాపు మూడు గంటల పాటు వైయస్ విజయమ్మ ఉన్నారు.  రాజరాజేశ్వరి అమ్మవారి  పీఠం దగ్గర ప్రత్యేక పూజలు చేసినట్లుగా సమాచారం. 

వైఎస్ విజయమ్మ కారుకు యాక్సిడెంట్.. తృటిలో తప్పిన ప్రమాదం...

అదే సమయంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ భవిష్యత్తు గురించి  మాట్లాడినట్లు తెలుస్తోంది. కుమార్తె షర్మిల ఆధ్వర్యంలో నడుస్తున్న పార్టీ అభ్యర్థులకు బీఫాంలో ఇచ్చేందుకు మంచి ముహూర్తం  గురించి కూడా ఆరా తీసినట్లుగా సమాచారం. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో కూడా.. వైఎస్ విజయమ్మ ఒంగోలు వచ్చి సిద్ధాంతి హనుమంతరావుతో చర్చించి, సలహాలు తీసుకునేవారు.

శుక్రవారం ఆమె సిద్ధాంతిని కలవడం అందుకే ప్రాధాన్యత సంతరించుకుంది. ఒంగోలు వచ్చే క్రమంలో వైయస్ విజయమ్మ కారుకు ప్రమాదం జరిగింది. పిడుగురాళ్ల, సంతమాగలూరు మధ్యలో  ఆమె ప్రయాణిస్తున్న కారును.. మరొకరు ఢీకొట్టడంతో కారు వెనుక భాగం కొద్దిగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు..  ఆక్సిడెంట్ అయినా కారులోనే ఒంగోలు వచ్చారు. 

click me!