దారుణం.. వివాహితను 20 రోజులు గదిలో బంధించి వాలంటీర్ అత్యాచారం..

By Asianet News  |  First Published Oct 28, 2023, 6:54 AM IST

గ్రామ వాలంటీర్ 20 రోజుల పాటు వివాహితపై లైంగిక దాడికి ఒడిగట్టిన ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలు పని చేసే ప్రదేశం నుంచి బలవంతంగా తీసుకెళ్లి, ఈ దారుణానికి పాల్పడ్డాడు. 


వివాహిత పట్ల గ్రామ వాలంటీర్ దారుణంగా ప్రవర్తించాడు. ఆమెను బెదిరించి, బలవంతంగా ఓ గదిలో బంధించి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలు కూతురు ఎదుటే తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు, ‘ఈనాడు’ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. 

ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు బోల్తా పడటంతో ఐదుగురు మృతి, 26 మందికి గాయాలు

Latest Videos

అనంతపురం జిల్లా యాడికి మండల పరిధిలో ఉన్న ఓ గ్రామంలో ఓ వివాహిత తన భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. అయితే ఆమె జీవనోపాధి కోసం యాడికి మండలం కేంద్రంలో ఉన్న ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నారు. అదే మండలానికి చెందిన దాసరి సతీశ్ గ్రామ  వాలంటీర్ గా పని చేస్తున్నారు. అతడు ఉప్పలపాడు గ్రామానికి చెందిన వ్యక్తి. 

కాగా.. ఆ వాలంటీర్ మూడు నెలలుగా ఆ వివాహిత ఇంటికి తరచూ వెళ్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. ఈ క్రమంలో ఎప్పటిలాగే ఈ నెల 7వ తేదీన ఆ వివాహిత బట్టల దుకాణంలో పని చేసేందుకు తన ఆరేళ్ల కూతురును తీసుకొని వెళ్లారు. ఇదే సమయంలో వాలంటీర్ అక్కడికి కారు తీసుకొని వచ్చాడు.

గ్యాంగ్ స్టర్ ముక్తార్ అన్సారీకి పదేళ్ల జైలు శిక్ష.. ఏ కేసులో అంటే ?

దుకాణం నుంచి వివాహితను బయటకు పిలిచాడు. ఆమెతో తన కోరికను తీర్చాలని మనసులోని మాట బయటపెట్టాడు. లేకపోతే భర్త పిల్లలను హతమారుస్తానని హెచ్చరించాడు. అనంతరం ఆమెను, ఆరేళ్ల చిన్నారిని బలవంతంగా కారులో ఎక్కించుకున్నాడు. ఆ కారును స్థానికంగా ఉన్న ఓ రూమ్ దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ వివాహితపై రెండు రోజుల పాటు లైంగిక దాడికి ఒడిగట్టాడు. అనంతరం కార్ ను రెంట్ కు తీసుకున్నాడు. ఈ నెల 9వ తేదీన తిరుపతి నగరానికి వెళ్లాడు. అక్కడ ఓ రెంట్ రూమ్ లో వివాహితను ఉంచాడు. ఆరేళ్ల చిన్నారు ఎదుటే పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

డ్యూటీలో ఉన్న పోలీసునే ఢీకొట్టిన కారు.. గాల్లోకి ఎగిరి కింద పడి, తీవ్రగాయాలపాలైన కానిస్టేబుల్.. వీడియో వైరల్

అక్కడి నుంచి బాధితురాలు తప్పించుకుందామని ప్రయత్నించాలని అనుకున్నా.. నిందితుడు బయటకు వెళ్లేటప్పుడు తాళం వేసేవాడు. కాగా.. మరో వైపు నాలుగు రోజుల నుంచి వివాహిత, చిన్నారి కనిపించకుండా పోవడంతో బాధిత కుటుంబ సభ్యులు ఈ నెల 11న యాడికి పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. ఈ క్రమంలో తిరుపతి పోలీసుల సాయంతో బాధితురాలిని ఈ నెల 25వ తేదీన విముక్తి చేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 

click me!