అవినీతి మ‌ర‌క లేని మ‌హానాయ‌కుడిని అక్ర‌మకేసుతో జైళ్లో పెట్టారు...అచ్చెన్నాయుడు

Google News Follow Us

సారాంశం

చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేత అచ్చెన్నాయుడు మండిపడ్డారు. అవినీతి మ‌ర‌క లేని మ‌హానాయ‌కుడిని అక్ర‌మకేసుతో జైళ్లో పెట్టారన్నారు. 

అమ‌రావ‌తి : సీఎం జ‌గ‌న్ నోరు విప్పితే అబ‌ద్దాలు త‌ప్పితే వాస్త‌వాలు మాట్లాడ‌టం లేదు అని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అవినీతి మ‌ర‌క లేని మ‌హానాయ‌కుడిని అక్ర‌మకేసుతో జైళ్లో పెట్టారని మండిపడ్డారు. చంద్ర‌బాబు కు సంబంధించి స్కిల్ కేసులో ఒక్క ఆధారం అయినా చూపించ‌గ‌ల‌రా..? అని ప్రశ్నించారు. 

ఓటుకు నోటు కేసులో చంద్ర‌బాబుకు సంబంధం లేద‌ని కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. పొత్తుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత సీఎంకు,మంత్రుల‌కు భ‌యం ప‌ట్టుకుంది. స్కిల్ కేసులో సీఎంతో ఎక్క‌డైనా బ‌హిరంగ చ‌ర్చ‌కు సిద్దంగా ఉన్నాం. ప‌వ‌న్ పొత్తుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత వైసీపీ నేత‌లు నిద్ర‌లేని రాత్రులు గ‌డుపుతున్నారని ఎద్దేవా చేశారు. 

స్కిల్ స్కామ్ సూత్రధారి చంద్రబాబే.. అడ్డంగా దొరికినా ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు: సీఎం జగన్

చాలామంది పోటీచేయ‌డానికి కూడా వెనకాడుతున్నారు.చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ త‌ర్వాత ఏం జ‌రిగిందో వాస్త‌వాల‌న్నీ చెప్పారు. పొత్తుల ప్ర‌క‌ట‌న సీక్రెట్ గా ఏమీ చేయ‌లేదు క‌దా...? అని ప్రశ్నించారు. ఈ రోజు వరుసగా నాలుగో ఏడాది ‘కాపు నేస్తం’ నిధులను జగన్ విడుదల చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అవినీతి చేసిన చంద్రబాబు అరెస్ట్ అయ్యాడన్నారు. స్కిల్ స్కాం సూత్రధారి చంద్రబాబే అన్నారు.

అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎవరైనా సరే శిక్ష తప్పదన్నారు. అంతేకాదు..ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అన్న మనిషి.. స్కాంతో అరెస్టైన వ్యక్తిని ప్రశ్నించకుండా ములాఖత్ కు వెళ్లి మిలాఖత్ ప్రకటించాడంటూ పవన్ కల్యాణ్ మీద సెటైర్లు విసిరారు. పరామర్శకు వెళ్లి పొత్తులు పెట్టుకున్నారంటూ ఎద్దేవా చేశారు. దీనిమీద టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఏ ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారని మండిపడుతున్నారు.