ఏసీబీ కోర్టు తిరస్కరణ: హైకోర్టులో అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్

Published : Jul 06, 2020, 03:37 PM IST
ఏసీబీ కోర్టు తిరస్కరణ: హైకోర్టులో అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్

సారాంశం

 మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు బెయిల్ కోసం సోమవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 3వ తేదీన ఏసీబీ కోర్టు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.దీంతో ఇవాళ ఏపీ హైకోర్టును అచ్చెన్నాయుడు ఆశ్రయించారు.


అమరావతి: మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు బెయిల్ కోసం సోమవారం నాడు హైకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 3వ తేదీన ఏసీబీ కోర్టు అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది.దీంతో ఇవాళ ఏపీ హైకోర్టును అచ్చెన్నాయుడు ఆశ్రయించారు.

అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని  ఏసీబీ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో అచ్చెన్నాయుడుబెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.

also read:ఏసీబీ కోర్టులో చుక్కెదురు: హైకోర్టుకు వెళ్లే యోచనలో అచ్చెన్నాయుడు

ఏసీబీ కస్టడీ పూర్తి కావడంతో వెంటనే బెయిల్ ఇవ్వాలని ఆ పిటిషన్ లో అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్నారు. 

జైలులో ఉన్న అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో అచ్చెన్నాయుడు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.

ఈఎస్ఐ స్కాంలో ఈ ఏడాది మే 7వ తేదీన ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. నిమ్మాడలో అరెస్ట్ చేసి ఆయనను విజయవాడకు తరలించారు. జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన తర్వాత ఈ నెల 1వ తేదీన ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu