ఏపీ హైకోర్టులో అశోక్‌ గజపతి రాజుకు ఊరట.. ఏ విషయంలో అంటే..

Published : Dec 30, 2021, 05:04 PM IST
ఏపీ హైకోర్టులో అశోక్‌ గజపతి రాజుకు ఊరట.. ఏ విషయంలో అంటే..

సారాంశం

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు (Ashok Gajapathi Raju) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) ఊరట లభించింది. రామతీర్థం‌ (Ramateertham) ఘటనకు సంబంధించి అశోక్ గజపతి రాజుపై నమోదైన ఎఫ్‌ఐఆర్ తదుపరి చర్యలు తీసుకొవద్దని ఆదేశించింది.  

కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజుకు (Ashok Gajapathi Raju) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) ఊరట లభించింది. రామతీర్థం‌ ఘటనకు సంబంధించి అశోక్ గజపతి రాజుపై నమోదైన ఎఫ్‌ఐఆర్ తదుపరి చర్యలు తీసుకొవద్దని ఆదేశించింది. వివరాలు.. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థం (Ramatheertham) బోడికొండపై కోదండరాముని ఆలయ (Kodandarama temple) పునర్నిర్మాణ శంకుస్థాపన సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రొటోకాల్‌ పాటించలేదని ఆలయ అనువంశిక ధర్మకర్తగా ఉన్న అశోక్‌ గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి ధర్మకర్తగా ఉన్న తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో అక్కడ శిలాఫలకాన్ని నెట్టే ప్రయత్నం చేశారు. అయితే అధికారులు, పోలీసులు అశోక్ గజపతి రాజును అడ్డుకున్నారు. ఆ తర్వాత శంకుస్థాపన కార్యక్రమం జరగ్గగా.. తనను కొబ్బరికాయ కొట్టకాయ కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అడ్డుకున్నారని అశోక్ గజపతి రాజు అసహనం వ్యక్తం చేశారు. 

మరోవైపు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) మాత్రం అశోక్ గజపతి రాజు తీరును తప్పుబట్టారు. ప్రొటోకాల్‌ ప్రకారం శిలాఫలకం చేయించామని, ఆలయాన్ని పునర్నిర్మించడం ఆయనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. ప్లాన్ ప్రకారమే అశోక్ గజపతి రాజు ఇలా చేశారని ఆరోపించారు. ఆయన నిజస్వరూపం బయటపడిదంటూ విమర్శలు కూడా చేశారు. 

అయితే రామతీర్థం కోదండరాముని ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాప సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలపై ఆలయ ఈవో డీవీవీ ప్రసాదరావు నెలిమర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ పునరుద్ధరణ పనుల శంకుస్థాపన సందర్భంగా ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడంతోపాటు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని అశోక్ గజపతి రాజుపై అభియోగాలు మోపారు. దీంతో పోలీసులు అశోక్ గజపతి రాజుపై కేసులు నమోదు చేశారు. 

దీంతో అశోక్ గజపతి రాజు హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్‌ఐఆర్‌లో తనపై నమోదు చేసిన సెక్షన్లు చెల్లవని.. తప్పుడు ఫిర్యాదు చేశారని అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశంతో కేసు నమోదు చేశారని.. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని ఫిర్యాదులో కోరారు. అరెస్ట్​తో పాటు ఎఫ్ఐఆర్ ఆధారంగా తదుపరి చర్యలన్నింటినీ నిలుపుదల చేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. అయితే ఇందుకు సంబంధించి వాదనలు విన్న హైకోర్టు.. ఎఫ్‌ఐఆర్‌పై తదుపరి చర్యలను నిలిపివేయాలని ఆదేశించింది.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?