మాన్సాస్ ట్రస్ట్ జీతాల వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన అశోక్ గజపతి, ఈవోపై అభియోగాలు

By Siva KodatiFirst Published Jul 24, 2021, 3:08 PM IST
Highlights

మాన్సస్ ట్రస్ట్‌లో ఉద్యోగుల జీతాలకు సంబంధించి ట్రస్ట్‌ ఛైర్మన్ అశోక్ గజపతి రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం వుంది. 

మాన్సస్ ట్రస్ట్‌లో ఉద్యోగుల జీతాల వివాదం పెను దుమారం రేపుతోంది. తాజాగా దీనిపై ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతి రాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మాన్సస్ ట్రస్ట్ ఈవో తనకు సహకరించడం లేదంటూ ఆయన పిటిషన్‌లో తెలిపారు. ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం వుంది. 

Also Read:మాన్సాస్ వివాదం... ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు

కాగా, మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజుపై విజయనగరం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. మాన్సాస్ చైర్మన్, కరస్పాండెంట్‌తో సహా 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈవో వెంకటేశ్వరరావు తమ వేతనాలు నిలిపివేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ మూడు రోజులక్రితం చైర్మన్ అశోక్ గజపతిరాజు వద్ద తమ ఆవేదనను వెల్లబోసుకున్నారు మాన్సాస్ ఉద్యోగులు. 19 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసన తెలిపారు.  దీంతో అశోక్ గజపతిరాజుతో పాటు ఉద్యోగులపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. 

కష్టం వచ్చిందని చెప్పుకునేందుకు వెళ్లిన తమపైన పోలీసులు అన్యాయంగా కేసు బనాయించడం దారుణమని ఉద్యోగులు అంటున్నారు. మాన్సాస్ చైర్మన్ అశోక్ గజపతిరాజేపైనా కేసు పెట్టడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

click me!