ఈ విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించిన ఆలూరి శేషాల్ని పోలీసులు అరెస్టు చేశారు. కానీ నేటికి నాలుగు రోజులు కావస్తున్నా జ్యుడీషియల్ రిమాండ్కు పంపలేదని ఆమె సోదరుడు బండ్ల గిరి సురేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ వాయిస్ రికార్డ్ ద్వారా పంపించారు.
గుంటూరు : నరసరావుపేట రొంపిచర్ల మండలం దొండపాడు గ్రామానికి చెందిన బండ్ల గిరి తిరుమల బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక మాటలు రాని మూగ యువతి, వికలాంగురాలిపై గేదెలకి వెళ్లిన సమయంలో అదే గ్రామానికి చెందిన అగ్ర సామాజిక వర్గానికి చెందిన ఆలూరి శేషాలు అనే యువకుడు బండ్ల గిరి తిరుమలపై 20వ తేదీ మంగళవారం అత్యాచారం చేశాడు.
ఈ విషయం బయటకు చెబితే చంపుతానని బెదిరించిన ఆలూరి శేషాల్ని పోలీసులు అరెస్టు చేశారు. కానీ నేటికి నాలుగు రోజులు కావస్తున్నా జ్యుడీషియల్ రిమాండ్కు పంపలేదని ఆమె సోదరుడు బండ్ల గిరి సురేష్ ఆవేదన వ్యక్తం చేస్తూ వాయిస్ రికార్డ్ ద్వారా పంపించారు.
ఈ ఘటనపై బీసీ సంక్షేమ సంఘం స్పందిస్తూ, అత్యాచారం చేసిన ముద్దాయిని అతనికి సహకరించిన మిగతా వారిని కూడా వెంటనే అరెస్టు చేసి జుడిషియల్ రిమాండ్ పంపించాలని లేనిపక్షంలో బీసీ సంక్షేమ సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని తెలియపరుస్తూ...అలాగే మహిళా సంక్షేమ శాఖ, హోం శాఖ మినిస్టర్ మేకతోటి సుచరిత వెంటనే ఆ యువతికి ప్రభుత్వం తరుపున 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని గుంటూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి బాదుగున్నల శీను కోరుతున్నారు.