దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి....: మోడీపై కేజ్రీవాల్ ఫైర్

By narsimha lodeFirst Published Feb 11, 2019, 2:09 PM IST
Highlights

:తిరుపతిలో దేవుడి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చి మోసం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు.భగవంతుడి సాక్షిగా హామీలను అమలు చేయకపోవడం విచారకరమన్నారు.  


న్యూఢిల్లీ:తిరుపతిలో దేవుడి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చి మోసం చేశారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చెప్పారు.భగవంతుడి సాక్షిగా హామీలను అమలు చేయకపోవడం విచారకరమన్నారు.  

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సోమవారం నాడు న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌ వేదికగా తలపెట్టిన దీక్షకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు.

అబద్దాలు చెప్పడంలో  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసిద్ది చెందారని ఆయన ఆరోపించారు.  మోడీ ఇచ్చిన హామీలను ఏనాడూ కూడ అమలు చేయలేదన్నారు.

తిరుపతిలో దేవుడి సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోడీ హామీ ఇచ్చి మోసం చేశారని కేజ్రీవాల్ చెప్పారు.భగవంతుడి సాక్షిగా హామీలను అమలు చేయకపోవడం విచారకరమన్నారు. 

తామంతా చంద్రబాబునాయుడుకు మద్దతుగా ఉన్నామన్నారు. ఢిల్లీ ప్రజల తరపున  మీ పోరాటంలో తాము ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటామని చెప్పారు.మోడీ బీజేపీకి చెందిన ప్రధానమంత్రి కాదన్నారు. దేశానికి ప్రధానమంత్రి అనే విషయాన్ని మోడీ గుర్తుంచుకోవాలన్నారు.

ఎన్నికల్లో పోటీ చేసి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికైన వ్యక్తి ఒక్క పార్టీకే ముఖ్యమంత్రి కాడన్నారు. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగానే ప్రధానమంత్రి కూడ అందరికీ ప్రధానమంత్రి అని ఆయన గుర్తు చేశారు.

బీజేపీయేతర పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల పట్ల ప్రధానమంత్రి వివక్ష చూపుతున్నారని కేజ్రీవాల్  ఆరోపించారు. ఢిల్లీలో 40 ఏళ్లుగా ఏసీబీ ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధీనంలో ఉందన్నారు. కానీ, రాష్ట్రంలో ఆప్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మోడీ ఏసీబీని పారా మిలటరీ బలగాలను పంపించి కబ్జా చేశారని కేజ్రీవాల్ ఆరోపించారు.

కోల్‌కత్తాలో ఆ సిటీ కమిషనర్ రాజీవ్‌కుమార్‌ను 40 మంది సీబీఐ అధికారులను పంపి భయబ్రాంతులను చేశారని చెప్పారు. అయితే సీబీఐ అధికారులకు మమత చుక్కలు చూపించారని కేజ్రీవాల్ ప్రశంసలు కురిపించారు.ఈ విషయమై తాను మమతకు సెల్యూట్ చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

మమత కేంద్రంతో పోరాటం చేసిందని ఆయన కితాబునిచ్చారు.దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. దేశమంతా బాబుకు అండగా ఉందన్నారు.


సంబంధిత వార్తలు

ఏపీ డిమాండ్లు నెరవేర్చాలి: ములాయం

దీక్ష: జయరామ్ రమేష్‌కు చంద్రబాబు కితాబు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మన్మోహన్ సింగ్

ఏపీ భారత్‌లో భాగం కాదా: చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్దతు

 

click me!