ఏపీ డిమాండ్లు నెరవేర్చాలి: ములాయం

By narsimha lodeFirst Published Feb 11, 2019, 1:23 PM IST
Highlights

ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అభిప్రాయపడ్డారు


న్యూఢిల్లీ: ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ అభిప్రాయపడ్డారు.  ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రబాబునాయుడు తలపెట్టిన దీక్షకు ములాయం సింగ్ యాదవ్ సంఘీభావం తెలిపారు.

సోమవారం నాడు న్యూఢిల్లీలోని ఏపీ భవన్ వేదికగా బాబు నిర్వహించిన దీక్ష శిబిరంలో బాబుకు మద్దతుగా ఆయన దీక్షలో పాల్గొన్నారు.  చంద్రబాబునాయుడు వెంట తామంతా ఉన్నామని ఆయన ప్రకటించారు. చంద్రబాబునాయుడు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడ తామంతా  మద్దతు ఇస్తామని ఆయన చెప్పారు.

చంద్రబాబు వెంట రైతులు, పేదలు అన్ని వర్గాల ప్రజల ఉన్నారని ములాయం సింగ్ యాదవ్ చెప్పారు.  న్యాయం కోసం ప్రజలు పోరాటం చేస్తున్నారని చెప్పారు. న్యాయం జరగకపోతే  ప్రజలు తిరగబడేందుకు కూడ సిద్దం కానున్నారని ఆయన  చెప్పారు.బాబు దీక్షకు లోక్‌తాంత్రిక్ జనతాదళ్ వ్యవస్థాపకులు  శరద్ యాదవ్, డీఎంకె ,ఆప్ నేతలు కూడ మద్దతు పలికారు.

సంబంధిత వార్తలు

దీక్ష: జయరామ్ రమేష్‌కు చంద్రబాబు కితాబు

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మన్మోహన్ సింగ్

ఏపీ భారత్‌లో భాగం కాదా: చంద్రబాబు దీక్షకు రాహుల్ మద్దతు

 

click me!