పెద్దకూరపాడు ఎమ్మెల్యే శంకర్‌రావు వేధిస్తున్నాడు: హైకోర్టులో యానిమేటర్ పిటిషన్

Published : Oct 16, 2020, 03:00 PM ISTUpdated : Oct 16, 2020, 03:08 PM IST
పెద్దకూరపాడు ఎమ్మెల్యే శంకర్‌రావు వేధిస్తున్నాడు: హైకోర్టులో యానిమేటర్ పిటిషన్

సారాంశం

పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు తనను వేధిస్తున్నాడని యానిమేటర్ అమరకుమారి ఏపీ హైకోర్టులో శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది.

అమరావతి: పెద్దకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు తనను వేధిస్తున్నాడని యానిమేటర్ అమరకుమారి ఏపీ హైకోర్టులో శుక్రవారం నాడు ఫిర్యాదు చేసింది.
వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకర్ రావు అధికారులతో తనను రాజీనామా చేయించాలని వేధింపులకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించారు.

రాజీనామా చేయాలని తనను వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులపై చర్యలు తీసుకొనేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరారు.

తనపై చాలా కాలంగా వేధింపులు కొనసాగుతున్నాయన్నారు.ఈ వేధింపులను ఇంతకాలం పాటు తాను పంటి బిగువున భరించామన్నారు. రోజు రోజుకి వేధింపులు తీవ్రంకావడంతో  చేసేదిలేక హైకోర్టును ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పిటిషనర్ అభిప్రాయపడ్డారు.

ఈ వేధింపుల నుండి తనను తాను రక్షించుకొనేందుకు గాను హైకోర్టును ఆశ్రయించినట్టుగా పిటిషనర్ పేర్కొన్నారు.  రాష్ట్రంలో ఉద్యోగులపై పలు చోట్ల ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని టీడీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

గతంలో విశాఖపట్టణం, చిత్తూరు జిల్లాల్లోని డాక్టర్లపై వేధింపుల విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్