తిరుమలలో దారుణం జరిగింది. పడుకునే స్థలం విషయంలో చెలరేగిన గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసింది.
తిరుమల : తిరుమలలో చిన్నపాటి గొడవ ఓ వ్యక్తి హత్యకు దారి తీసిన ఉదంతం తిరుమలలో చోటుచేసుకుంది. తిరుమల వన్ టౌన్ సిఐ జగన్మోహన్ రెడ్డి కథనం ప్రకారం… తమిళనాడులోని ఆరని జిల్లాకు చెందిన కే శరవణన్ (52) అదే రాష్ట్రం వేలూరు కు చెందిన బి. భాస్కర్
ఇద్దరూ తిరుమలలో చిన్నచిన్న పనులు చేసుకుంటూ రాత్రి పూట... అక్కడే పడుకుంటుండేవారు. అలా బుధవారంనాడు రాత్రి స్థానిక మ్యూజియానికి ఎదురుగా ఉన్న వయోవృద్ధుల టిక్కెట్ల పంపిణీ కేంద్రం దగ్గర ముందుగా భాస్కర్ వచ్చి పడుకున్నాడు.
ఆ తరువాత శరవణన్ అక్కడికి వచ్చాడు. అది తన చోటని.. తన చోటులో ఎందుకు పడుకున్నావని భాస్కర్ తో గొడవపడ్డాడు. భాస్కర్ ను అక్కడినుంచి పంపించివేశాడు. అప్పుడు వెళ్లిపోయిన భాస్కర్ పట్టరాని కోపంతో.. కొంతసేపటికి సిమెంట్ రాయిని తీసుకుని వచ్చాడు. ఆ రాయితో నిద్రపోతున్న శరవణన్ తల మీద మోది హత్య చేశాడు. పక్కన ఉండే మిగతావారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. హత్యాస్థలాన్ని పరిశీలించి.. వివరాలు సేకరించారు. నిందితుడు భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు.
undefined
ఇదిలా ఉండగా, గురువారం తెలంగాణలోని నిజామాబాద్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత చెట్టుకు ఉరి వేసి, మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రామచంద్ర పల్లిలో వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రపల్లికి చెందిన పెద్దింట్ల పోశెట్టి మంగళవారం ఉదయం బ్యాంకుకి వెళ్తున్నానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళాడు. సాయంత్రం అయినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబసభ్యులు ఫోన్ చేశారు. అయితే, తను వేరే పనిలో ఉన్నానని.. రాత్రి వరకు ఇంటికి వస్తానని అతను చెప్పాడు. బుధవారం ఉదయం పోశెట్టి మృతదేహాన్ని గ్రామశివారులో స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
వారు పోలీసులకు చెప్పడంతో.. డిసిపి అరవింద్, ఏసీపీ వెంకటేశ్వర్లు, సిఐ నరేష్, ఎస్సై యాదగిరి గౌడ్ సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ పరిశీలించారు. అది కొద్ది దూరం వెళ్లి ఆగిపోయింది. కుటుంబ సభ్యులు నలుగురు అనుమానితులు పేర్లు చెప్పడంతో వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. పోశెట్టి రెండు కాళ్లు కట్టేసి.. ఆపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు ప్రాథమిక దర్యాప్తులో, తేలిందని, విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ నరేష్ తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దంపతుల కోసం గాలిస్తున్నట్లు వివరించారు ఆయనకు ఇద్దరు కొడుకులున్నారు. వ్యవసాయ కూలీలుగా పని చేసే పోశెట్టి గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటాడని గ్రామస్తులు తెలిపారు. అయితే, పోశెట్టికి ఆర్థికపరమైన లావాదేవీలు, తగాదాలు ఉన్నాయని.. అదే క్రమంలో ఈ రోజు భూవివాదంలో ఉన్న కేసు విషయంలో కోర్టుకు హాజరు కావాల్సి ఉందని మృతుని కుమారుడు తెలిపాడు.