మైనర్ ప్రియుడితో కలిసి.. భర్తను కుక్కర్ తో బాది హత్యచేసిన భార్య, శవాన్ని మూటగట్టి, నిప్పుపెట్టి.. దారుణం..

Published : Jul 22, 2022, 09:09 AM IST
మైనర్ ప్రియుడితో కలిసి.. భర్తను కుక్కర్ తో బాది హత్యచేసిన భార్య, శవాన్ని మూటగట్టి, నిప్పుపెట్టి.. దారుణం..

సారాంశం

విశాఖ పట్నంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ తో వివాహేతర సంబంధం పెట్టుకున్న వివాహిత.. కట్టుకున్న భర్తను అతి దారుణంగా హత్య చేసింది. ఆ తరువాత శవాన్ని మూటగట్టి ఊరవతల పారేసింది. వాసన వస్తుందని తెలియడంతో మూడు రోజుల తరువాత పెట్రోల్ పోసి, నిప్పంటించింది.

విశాఖపట్నం : విశాఖపట్నంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.  ప్రియుడి కోసం ఓ మహిళ భర్తని దారుణంగా చంపేసింది. 18 ఏళ్ల వయసున్న మైనర్ ప్రియుడితో కలిసి భర్తను కుక్కర్ తో కొట్టి హత్య చేసింది. విశాఖపట్నంలోని మధురవాడలో బుడుమూరు మురళి  కుటుంబం నివాసం ఉంటుంది. మురళికి పదేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మృదుల అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడు. ఈ దశలో ఉపాధి రీత్యా మురళి సౌత్ ఆఫ్రికాలో ప్రొఫెసర్ గా పని చేయడానికి వెళ్లాడు. భర్త ఇంటికి దూరంగా ఉంటున్న క్రమంలో మృధులకు.. ఆమె నివాసం ఉంటున్న రిక్షా కాలనీలో శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.

వీరిద్దరి మధ్య ఏడాదికాలంగా సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరికి శంకర్ కి 18 ఏళ్లు నిండాయి. భర్త లేకపోవడంతో శంకర్ తో వివాహేతర సంబంధం కొనసాగించింది మృధుల. ఈ విషయం తెలిసిన భర్త ప్రశ్నించడంతో.. అతని మీద  వేధింపుల కేసు కూడా పెట్టింది. ఈ దశలో ఈ నెల 9వ తేదీన మురళి సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చాడు.  భార్య వ్యవహారంపై ముందునుంచే మురళికి అనుమానం ఉండడంతో కుటుంబ సభ్యులకు తనకు ప్రాణహాని ఉందని చెప్పేవాడు. ఈనెల 9వ తేదీన విశాఖ వచ్చిన మురళి 11వ తేదీన తల్లి వద్దకు వెళ్లాలని అనుకున్నాడు. 

పులివెందులలో హిజ్రాపై అత్యాచారం కేసులో ఎనిమిది మంది అరెస్ట్.. మరో ఐదుగురి కోసం గాలింపు..

ఈ నేపథ్యంలోనే మృదుల  60 రోజుల పాటు భర్త మురళి విశాఖపట్నంలోనే ఉంటాడని, దీనివల్ల తామిద్దరం కలిసే అవకాశం ఉండదని శంకర్ తో చెప్పింది. అంతకాలం దూరంగా ఉండలేమని భర్తను హత్య చేస్తే జీవితకాలం కలిసి ఉండవచ్చని శంకర్  మృధులకు చెప్పాడు. ఆ ప్రకారం వీరిద్దరూ ఇంట్లో నిద్రపోతున్న భర్తని చంపేయాలని నిర్ణయించుకున్నారు. అలా భర్త నిద్రపోతుండగా కుక్కర్ తో తలపై చితకబాదింది భార్య. దీనికి ప్రియుడు శంకర్ సహకరించాడు. వీరిద్దరూ కలిసి  ప్రాణం పోయేంతవరకు మురళిని తీవ్రంగా కొట్టారు.

ఆ తరువాత మృతదేహాన్ని మూటగట్టి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మారికవలస గడ్డలో స్కూటీపై వెళ్లి పడేశారు. రజకుల బట్టల మూటగా నమ్మించే రీతిన మృతదేహాన్ని దుప్పట్లో కట్టేశారు.  మూడు రోజుల తర్వాత మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో రాత్రి ప్రియుడు, మృదుల వెళ్లి పెట్రోలు పోసి నిప్పంటించారు. అయితే ఇంటికి వస్తాను అన్న కొడుకు రాకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. ఆమె కోడలిని దీనమీదప్రశ్నించడంతో.. భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది.

భర్త దూరంగా ఉండడంతో మృధుల వివాహేతర సంబంధం పెట్టుకుందని.. దీన్ని ప్రశ్నించగా తన కొడుకుపైన కేసు పెట్టిందని మురళి తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. మురళిని అత్యంత దారుణంగా హతమార్చిన మృధుల, ప్రియుడు శంకరులను ఉరితీయాలని కోరింది. సమాజం తలదించుకునే రీతిలో వ్యవహరించిన వీరిద్దరికీ కఠిన శిక్ష పడేవరకు న్యాయ పోరాటం చేస్తానని అంటోంది.

PREV
click me!

Recommended Stories

Sandhyarani: అంగన్వాడీల 9కోర్కెలు పూర్తి చేశాం.. త్వరలో ఇది కూడా పూర్తి చేస్తాం| Asianet News Telugu
AP Food Commission Chairman Chitha Vijay Prathap Reddy on Anganwadi Centres | Asianet News Telugu