పులివెందులలో హిజ్రాపై అత్యాచారం కేసులో ఎనిమిది మంది అరెస్ట్.. మరో ఐదుగురి కోసం గాలింపు..

Published : Jul 22, 2022, 08:00 AM IST
పులివెందులలో హిజ్రాపై అత్యాచారం కేసులో ఎనిమిది మంది అరెస్ట్.. మరో ఐదుగురి కోసం గాలింపు..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ లోని పులివెందులలో ఓ హిజ్రాపై అత్యాచారం కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు. 

పులివెందుల : పులివెందులలో హిజ్రాపై (50) అత్యాచారానికి పాల్పడిన కేసులో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరో ఐదుగురి కోసం గాలిస్తున్నామని డిఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా  పులివెందుల పోలీస్ స్టేషన్లో గురువారం ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. బాధిత హిజ్రా  13 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బుధవారంనాడు దిశ యాప్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే దీని మీద దర్యాప్తు చేపట్టారు.  పులివెందులకు చెందిన పీ చక్రధర్, కే చలపతి, ఏ బాల గంగిరెడ్డి, పి గురు ప్రసాద్, కే కుమార్, ఎస్ బ్రహ్మయ్య, పి. జయచంద్ర శేఖర్ రెడ్డి, ఎం హరికృష్ణరెడ్డి, చిన్న అలియాస్ తరుణ్, బాబావల్లి, ఓ ప్రైవేటు పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు సురేంద్ర, షాకీర్, సుభాష్.. లు నిందితులుగా గుర్తించారు. 

వీరు ఓ పంచాయతీ కోసం సత్య జిల్లా రాగన్నగారిపల్లెకు రెండు వాహనాల్లో వెళ్లారు. తిరిగి పులివెందులకు వస్తూ.. కదిరి రహదారిలోని గంగమ్మ గుడి దగ్గరికి చేరుకున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు హిజ్రాల్లో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల కోసం పోలీసులు గాలించారు.  కదిరి రహదారిలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలో చక్రధర్,  చలపతి,  బాలగంగి రెడ్డి, గురు ప్రసాద్, కుమార్, బ్రహ్మయ్య, జయ చంద్రశేఖర్ రెడ్డి, హరికృష్ణ రెడ్డి కనిపించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

చెట్టంత కొడుకును కొట్టి చంపి, ఇంటివెనుక పాతిపెట్టిన కన్నతల్లి..

ఇదిలా ఉండగా, వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో హిజ్రాపై అత్యాచారం ఘటన వెలుగులోకి వచ్చింది. కామంతో కళ్లు మూసుకుపోయిన కీచకులకు మహిళలు, పసివాళ్లు, యువతులు, ముసలివాళ్లు అన్న తేడా కాదు.. స్త్రీ, పురుషుడు, హిజ్రా అనే తేడాలూ లేకుండా పోయాయి. కన్ను పడితే చాలా వారిమీద అత్యాచారం చేసి కానీ వదిలిపెట్టడం లేదు. అలా ఓ హిజ్రా మీద అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ఏపీలోని పులివెందులలో ఓ హిజ్రాపై పదిమంది గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడిన ఉదంతం బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం ఓ హిజ్రా (35) పట్టణంలో ఒంటరిగా నివాసం ఉంటోంది. రెండు రోజుల కిందట పదిమంది ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డారని తెలిసింది. 

PREV
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!