కరోనా ఎఫెక్ట్: అరసవెల్లి ఆలయం మూసివేత

Published : Apr 22, 2021, 03:57 PM IST
కరోనా ఎఫెక్ట్: అరసవెల్లి ఆలయం మూసివేత

సారాంశం

కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండడంతో  రేపటి నుండి అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. వచ్చే నెల 10వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తామని అధికారులు ప్రకటించారు. 

శ్రీకాకుళం: కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండడంతో  రేపటి నుండి అరసవిల్లి సూర్యనారాయణస్వామి ఆలయాన్ని మూసివేయాలని అధికారులు నిర్ణయం తీసుకొన్నారు. వచ్చే నెల 10వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేస్తామని అధికారులు ప్రకటించారు.  ఈ ఆలయానికి చెందిన  ఈవో, మరో ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకింది.  దీంతో వారంతా హోం క్వారంటైన్ లో ఉన్నారు.  ఆలయ పరిసరాల్లో సుమారు 100కి పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో రేపటి నుండి మే 10వ తేదీ వరకు ఆలయాన్ని మూసివేయాలని నిర్ణయించారు అధికారులు.

మరోవైపు పశ్చిమగోదావరి జిల్లాలోని ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడ మూసివేస్తున్నామని ప్రకటించింది.  గత ఏడాదిలో కరోనా నేపథ్యంలో  ఏపీ రాష్ట్రంలో పలు ఆలయాలను మూసివేశారు. తిరుపతి ఆలయంతో పాటు పలు ఆలయాలను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ దఫా కూడ  ఎక్కువగా కేసులు నమోదౌతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని భక్తులకు దర్శనాల సంఖ్యను తగ్గించింది టీటీడీ. శ్రీరామనవవి ఉత్సవాలను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో  భక్తులు లేకుండానే శ్రీరాముడి కళ్యాణోత్సవం నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్