ముగిసిన మంత్రివర్గ ఉపసంఘం భేటీ.. ఏం చేయాలన్న దానిపై సీఎంకు చెబుతాం: ఆళ్ల నాని

By Siva KodatiFirst Published Apr 22, 2021, 3:17 PM IST
Highlights

కరోనా కట్టడిపై ఏపీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి కట్టడికి ఏం చేయాలో చర్చించామని వెల్లడించారు. బెడ్స్ కొరత, రెమిడెసివర్ లభ్యత తదితర అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. 

కరోనా కట్టడిపై ఏపీ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి కట్టడికి ఏం చేయాలో చర్చించామని వెల్లడించారు.

బెడ్స్ కొరత, రెమిడెసివర్ లభ్యత తదితర అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఆక్సిజన్, మందుల కొరతను అధిగమించేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు.

సబ్ కమిటీ సూచనల్ని రేపు సీఎం సమీక్షలో వివరిస్తామని ఆళ్ల నాని స్పష్టం చేశారు. ఎలాంటి విపత్కర పరిస్ధితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామని మంత్రి వెల్లడించారు.

Also Read:కరోనా ఎఫెక్ట్: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

ప్రజలు కూడా వ్యక్తిగత రక్షణ చర్యలు పాటించాలని.. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నామని ఆళ్ల నాని తెలిపారు. ఏపీకి రోజుకు కావాల్సిన మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా అవుతోందని మంత్రి పేర్కొన్నారు. 

కాగా, మంగళగరిలోని ఏపీఐఐసీ భవనంలో మంత్రివర్గ ఉపసంఘం గురువారం భేటీ అయ్యింది. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని కన్వీనర్‌గా ఉన్న ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథరెడ్డి సభ్యులుగా ఉన్నారు. 
 

click me!