అరకు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ నుంచి మత్స్యలింగం, టీడీపీ నుంచి దొన్నుదొర పోటీలో ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ నెలకొంది.
అరకు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వైసిపిలో అరకు అభ్యర్థి ఎంపిక కోసం సుధీర్ఘ కసరత్తు జరిగింది. అరకులో కొండదొర సామాజికవర్గ ఓటర్లు దగ్గరదగ్గర లక్షమంది వున్నారు. దీంతో ఆ సామాజికవర్గానికి అరకు సీటు కేటాయించాలని వైసిపి భావించింది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న చిట్టి పాల్గుణకు కాకుండా ఎంపీ గొడ్డేడి మాధవికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించింది వైసిపి. అయితే అరకు వైసిపి నాయకులు మాధవిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇంచార్జీ బాధ్యతల నుండి తప్పించారు. ఆ స్థానంలో స్థానిక నాయకుడు మత్స్యలింగం ను నియమించింది.
ఇక మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయిన మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు కిడారి శ్రావణ్ కుమార్ ను గతంలో టిడిపి మంత్రిపదవి ఇచ్చింది. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ శ్రావణ్ ను బరిలోకి దింపింది. కానీ అతడు ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. దీంతో ఈసారి శ్రావణ్ ను పక్కనబెట్టిన టిడిపి సియారి దొన్నుదొర ను బరిలో దింపింది.
అరకు నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. ముంచింగిపుట్టు
2. పెడబయలు
3. డుంబ్రిగూడ
4. హుకుంపేట
5. అనంతగిరి
6. అరకు లోయ
అరకు అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,20,893
పురుషులు - 1,08,190
మహిళలు - 1,12,698
అరకు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
అరకు అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా రేగం మత్య్స లింగం పోటీలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి సియ్యారి దొన్ను దొరను అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించింది. ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. వీరిలో ఎవరు విన్నర్ అనేది కాసేపట్లో తేలనుంది. ప్రస్తుతానికి వైసీపీ లీడింగ్ కనిపిస్తుంది.
అరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
అరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అరకు నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుపై 31,877 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అరకు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,57,575 (71 శాతం)
వైసిపి - చెట్టి పాల్గుణ - 53,101 (33 శాతం) - 25,441 ఓట్ల మెజారిటీతో విజయం
స్వతంత్ర అభ్యర్థి - దొన్నుదొర సియ్యారి - 27,660 (17 శాతం) - ఓటమి
టిడిపి - కిడారి శ్రావణ్ కుమార్ - 19,929 (12 శాతం)
అరకు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,50,109 (70 శాతం)
వైసిపి - కిడారి సర్వేశ్వరరావు - 63,700 (43 శాతం) - 34,053 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - సివేరి సోమ - 29,647 (20 శాతం) - ఓటమి