గాజువాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

Published : Jun 04, 2024, 11:34 AM ISTUpdated : Jun 06, 2024, 05:49 PM IST
గాజువాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 Live

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లోని అతిపెద్ద నియోజకవర్గాల్లో గాజువాక ఒకటి. ఈ నియోజకవర్గంలో 3 లక్షలకు పైగా ఓటర్లు వున్నారు. ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి వున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఇక్కడినుండి పోటీచేసి ఓడిపోయారు... ఇలా గాజువాక ప్రజల తీర్పు రాష్ట్ర ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది.

Gajuwaka Assembly Elections Result 2024: గత మూడు అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే గాజువాక ప్రజలు వినూత్న తీర్పు ఇస్తూ వస్తున్నారు. 2009 లో ప్రజారాజ్యం, 2014లో తెలుగుదేశం, 2019 లో వైసిపిని  గెలిపించారు గాజువాక ఓటర్లు. ఇలా మూడుసార్లు మూడు వేరువేరు పార్టీలు గాజువాకలో గెలిసాయి... మరి ఈసారి గెలుపు ఎవరిదన్నది ఆసక్తికరంగా మారింది.  

గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గాజువాక నుండి పోటీ చేసారు. దీంతో ఈ నియోజకవర్గం పేరు రాష్ట్రవ్యాప్తంగా మారుమోగింది. కానీ గాజువాక ప్రజలుమాత్రం పవన్ ను ఓడించారు. అయితే పవన్ లాంటి స్టార్ హీరోను, ఓ పార్టీ అధినేతను ఓడించిన నాగిరెడ్డిని ఈసారి వైసిపి పక్కనబెట్టింది. ఆయన స్దానంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డిని పోటీచేయిస్తోంది వైసిపి.  దీంతో గాజువాక అసెంబ్లీ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 

గాజువాక నియోజకవర్గ పరిధిలోని  మండలాలు :

1. గాజువాక 
2. పెదగంట్వాడ

గాజువాక అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య  - 3.12  లక్షలు   
పురుషులు -    1,57,787
మహిళలు ‌-    1,55,009

గాజువాక అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

గాజువాకలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అనకాపల్లి నుండి ఆయనను గాజువాకకు షిప్ట్ చేసారు. ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డికి ఈసారి అవకాశం దక్కలేదు. 

టిడిపి అభ్యర్థి : 

తెలుగుదేశం పార్టీ గాజువాకలో పల్లా శ్రీనివాసరావును మరోసారి పోటీ చేయిస్తోంది.  2014 లో ఇదే గాజువాక నుండి గెలిచిన పల్లా 2019 లో మాత్రం మూడో స్థానానికి పరిమితం అయ్యారు.

గాజువాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :

గాజువాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

గాజువాక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. YSRCPకి చెందిన గుడివాడ అమర్‌నాథ్ పై TDP పార్టీకి చెందిన పల్లా శ్రీనివాస్ రావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పల్లా శ్రీనివాసరావు  157,703    (67.3శాతం) ఓట్లు సాధించగా, గుడివాడ అమర్నాథ్ 62,468(26.66 శాతం) ఓట్లు సాధించారు.    

గాజువాక అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,99,284 ఓట్లు (64 శాతం)

వైసిపి - తిప్పల నాగిరెడ్డి -  75,292 ఓట్లు (37 శాతం) - 16,753 ఓట్ల మెజారిటీతో విజయం 

జనసేన పార్టీ - పవన్ కల్యాణ్ - 58,539 ఓట్లు (29 శాతం) - ఓటమి

టిడిపి ‌- పల్లా శ్రీనివాసరావు - 56,642 (28 శాతం)

గాజువాక అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,88,401 ఓట్లు (64 శాతం)

టిడిపి - పల్లా శ్రీనివాసరావు - 97,109 (51 శాతం) - 21,712 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - తిప్పల నాగిరెడ్డి - 75,397 (40 శాతం) - ఓటమి

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?
Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం