Kakinada City assembly elections result 2024 : కాకినాడ అర్భన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE

Published : Jun 04, 2024, 11:36 AM ISTUpdated : Jun 06, 2024, 07:23 PM IST
Kakinada City assembly elections result 2024 : కాకినాడ అర్భన్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 LIVE

సారాంశం

Kakinada City assembly elections result 2024  live : ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి ఒక్కటి ఒకవైపు... టిడిపి, జనసేన, బిజెపి కూటమి మరోవైపు నిలిచాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఇలా పోర్ట్ సిటీ కాకినాడలో కూడా హాట్ హాట్ రాజకీయాలు సాగుతున్నాయి. దీంతొ కాకినాడ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. 

Kakinada City assembly elections result 2024  live :

కాకినాడ రాజకీయాలు : 

కాకినాడ అర్బన్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ద్వారాంపూడి చంద్రశేఖర్ రెడ్డి కొనసాగుతున్నారు. 2008లో జరిపిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో కాకినాడ సిటీ అసెంబ్లీ ఏర్పడింది... అప్పటినుండి ఇక్కడ ద్వారంపూడి హవా సాగుతోంది. 2009 లో మొదటిసారి కాకినాడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుండి గెలిచిన ద్వారంపూడి 2019 లో వైసిపి నుండి గెలిచారు.  మధ్యలో 2014 ఎన్నికల్లో టిడిపి  నుండి వనమాడి వెంకటేశ్వరరావు కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 

కాకినాడ సిటీ నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

1. కాకినాడ అర్భన్ మండలం (కాకినాడ పట్టణంలోని 1వ వార్డు నుండి 65 వరకు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి)
 

కాకినాడ సిటీ అసెంబ్లీ ఓటర్లు : 

నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) ‌- 2,55,773   

పురుషులు -  1,23,298
మహిళలు ‌-  1,32,333

కాకినాడ రూరల్ అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు : 

వైసిపి అభ్యర్థి :

కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మళ్లీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పోటీ చేశారు.

టిడిపి అభ్యర్థి :

టిడిపి, జనసేన, బిజెపి పొత్తు నేపథ్యంలో కాకినాడ అర్బన్ నియోజకవర్గం  నుంచి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పోటీ చేశారు. 
 
కాకినాడ సిటీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ;

 

కాకినాడ నగరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

కాకినాడ నగరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో వనమాడి వెంకటేశ్వరరావు 113014 (63.7%) ఓట్లు సాధించగా..  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి  56,442 (32.9%) ఓట్లు సాధించారు.    
 
కాకినాడ సిటీ అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,71,604

వైసిపి -  ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి - 73,890 (43 శాతం) ‌ - 14,111 ఓట్ల మెజారిటీతో విజయం

టిడిపి - వనమాడి వెంకటేశ్వరరావు  - 59,779 (34 శాతం) - ఓటమి 

జనసేన పార్టీ - ముఠా శశిధర్ ‌- 30,188 (17 శాతం) 
 

కాకినాడ సిటీ  అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :

నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు -   1,40,523 (67 శాతం)

టిడిపి  - వనమాడి వెంకటేశ్వరరావు - 76,467 (54 శాతం) - 24,000 ఓట్ల మెజారిటీతో విజయం

వైసిపి - ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి - 52,467 (37 శాతం) - ఓటమి

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?