మహిళతో కానిస్టేబుల్ రాసలీలలు: రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మహిళ భర్త

Published : Oct 12, 2020, 07:17 PM ISTUpdated : Oct 12, 2020, 07:18 PM IST
మహిళతో కానిస్టేబుల్ రాసలీలలు: రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మహిళ భర్త

సారాంశం

తన భార్య హోటల్ గదిలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ తో రాసలీలలు నడుపుతుండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పటుకున్నాడు. ఈ సంఘటన ఏపీలోని అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ బాగోతం బయటపడింది. ఏఆర్ కానిస్టేబుల్ మరో మహిళతో హోటల్ గదిలో ఉండగా ఆ మహిళ భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆ సంఘటన రాయదుర్గం పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారంనాడు వెలుగు చూసింది.

బ్యుటిషియన్ గా పనిచేస్తున్నానని చెప్పి తన భార్య ఏఆర్ కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని మహిళ భర్త ఆరోపించాడు. భార్య ప్రవర్తనపై అతను పోలీసుల వద్ద తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఏఆర్ కానిస్టేబుల్ ను, మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని స్టేషన్ కు తరలించారు. 

కామాంధుడి అకృత్యం

ఇదిలావుంటే, తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఘోరం జరిగింది. ప్రేమ పేరుతో ఓ కామాంధుడు మోసం చేయడంతో బాలిక గర్భం దాల్చింది. విషయం బయటకు తెలియకూడదనే ఉద్దేశంతో ప్రసవం చేయడానికి తల్లి చేసిన ప్రయత్నం వికటించింది. జగిత్యాల జిల్లా దర్మపురిలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

పురుటి నొప్పులు రావడంతో బాలిక తల్లి ఇంట్లోనే సొంత వైద్యం చేసింది. దాంతో బాలికతో సహా శిశువు మరణించింది. రెండు రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాలను పూడ్చి పెట్టారు. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. 

సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. శవాలను వెలికి తీశారు. బాలిక మృతికి కారణమైన ఆమె తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై స్థానికలు, దళిత సంఘాల నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను గర్భవతిని చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

భార్యను సజీవ దహనం చేసిన భర్త

తెలంగాణ రాజధాని హైదరాబాదులో మరో ఘోరం జరిగింది. అ వ్యక్తి తన భార్యను సజీవ దహనం చేశాడు. ఉద్యోగం చేయకుండా ఖాళీగా ఉన్నావని నిలదీసిన భార్య లక్ష్మికి భర్త వెంకన్న నిప్పంటించాడు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లక్ష్మి మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి భర్త వెంకన్నను పోలీసులు అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఆకాశంలో నల్లని మేఘాలు లోడింగ్... తెలంగాణలో 10, ఏపీలో 7 జిల్లాల్లో భారీ వర్షాలు
దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli