APSRTC: ప్రయాణికులకు శుభ‌వార్త‌.. సంక్రాంతి భారీ స్పెషల్‌ బస్సులు.. పూర్తి వివరాలివే..

By Rajesh K  |  First Published Jan 4, 2022, 6:34 AM IST

APSRTC: సంక్రాంతి సంద‌ర్బంగా ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఏర్పాటు చేసినట్లు ఆంధ్ర ప్రదేశ్ ఆర్​టీసీ తెలిపింది. ముఖ్యంగా హైదరాబాద్​, చైన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఈ స్పెషల్​​ బస్సులు ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపింది.  
 


 APSRTC Sankranti special buses: సంక్రాంతి వచ్చిందంటే ఆ జోషే వేరు. తెలుగు లొగ్గిళ్లో చాలా వైభవంగా జ‌రిగే పండుగ సంక్రాంతి. ఈ  పండుగ కోసం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రజలు దేశంలో ఎక్కడున్న స్వస్థలానికి రావ‌డానికి  ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల రద్ధీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్​ ఆర్​టీసీ (APSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగకు బస్సుల్లో ఊరేళ్లేవారికి.. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ సన్నద్ధమైంది. భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. 
ఈ సంక్రాంతి సీజ‌న్లో ఏకంగా 6,970 ప్రత్యేక సర్వీసులు న‌డిపించ‌నున్న‌ట్టు తెలిపింది. వాటిలో పండగ ముందు 4,145 ప్రత్యేక సర్వీసులు, పండగ తరువాత 2,825 ప్రత్యేక సర్వీసులు న‌డ‌పాలని ప్ర‌ణాళిక సిద్దం చేసుకుంది.  గతేడాది కంటే 35 శాతం అధికంగా ప్రత్యేక బస్సులు నడపాలని నిర్ణయించింది.  

సంక్రాంతి స్పెషల్‌ సర్వీసులు జ‌న‌వ‌రి 8 నుంచి ప్రారంభించ‌నున్న‌ట్టు తెలిపారు.   సంక్రాంతి పండుగ ముందు నుంచే 4,145 ప్రత్యేక బస్సులు న‌డ‌ప‌నున్న‌ది. ముఖ్యంగా హైదరాబాద్​, చైన్నై, బెంగళూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు ఈ స్పెషల్​​ బస్సులు నడవనున్నాయని వివరించింది.    ఇందులో ఒక్క హైదరాబాద్​కే 1,500 బస్‌ సర్వీసులను కేటాయించారు. విశాఖపట్నానికి 650, విజయవాడకు 250, బెంగళూరుకు 100, చెన్నైకి 45 సర్వీసులు నిర్వహిస్తారు. 

Latest Videos

undefined

Read Also :  TTD Darshan Tickets Scam: తిరుప‌తిలో న‌కిలీ టిక్కెట్ల ముఠా గుట్టు రట్టు

గిలిన 1,600 సర్వీసులు అన్ని జిల్లా కేంద్రాలతోపాటు ప్రధాన పట్టణాలకు కేటాయించారు. విజయవాడ నుంచి సమీప రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ఈ స్పెషల్​ బస్సులను నడిపించనున్నట్లు వెల్లడించింది. గత ఏడాది సంక్రాంతి ముందు మొత్తం 2,982 ప్రత్యేక బస్సులే ఆర్టీసీ నడిపింది. ఈసారి 1,163 సర్వీసులను అధికంగా కేటాయించింది. అలాగే, పండగ తరువాత తిరుగు ప్ర‌యాణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా తగినన్ని ప్రత్యేక బస్సు సర్వీసులను ఆర్టీసీ నడుపుతోంది. జనవరి 15 నుంచి 17 వరకు 2,825 ప్రత్యేక బస్సులు నడపనుంది. 

Read Also :  Corona Vaccination: తొలిరోజే రికార్డు స్థాయిలో టీనేజర్ల‌కు వ్యాక్సినేష‌న్

వాటిలో హైదరాబాద్‌కు 1000 బస్సులు, విశాఖపట్నానికి 200 బ‌స్సులు, విజయవాడకు 350 బ‌స్సులు, బెంగళూరుకు 200బ‌స్సులు, చెన్నైకు 75 బస్సులతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు నిర్వహిస్తారు. గతేడాది సంక్రాంతి తరువాత 2,151 ప్రత్యేక బస్సులు నిర్వహించారు. ఈ ఏడాది 674 బస్సులను అధికంగా కేటాయించారు. 

click me!