మైనర్ అయిన ఓ బాలుడు పన్నెండేళ్ల తన సవతి సోదరి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ చిన్నారి గర్భం దాల్చింది. విషయం తెలిసినా కుటుంబసభ్యులు దాచిపెట్టారు. తీరా ప్రసవానికి తీసుకురావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
అమరావతి : amaravatiలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 12యేళ్ల బాలిక మీద ఆమె సవతి అన్న molestationకి పాల్పడ్డాడు. దీంతో ఆ బాలిక pregnant అయ్యింది. ఈ విషయాన్ని దాచి పెట్టిన పెద్దలు.. నెలలు నిండడంతో బాలికను ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకురాగా సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో నిందితుడైన బాలుడు కూడా మైనరే. అతనిప్పుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ప్రస్తుతం గర్భవతి అయిన బాలికను ప్రసవం కోసం సోమవారం Andhra Pradeshలోని నెల్లూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. దీంతో అక్కడి వైద్యసిబ్బంది ప్రశ్నించగా విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లాలో నివసిస్తున్న ఓ జంట ఐదేళ్ల క్రితం విడిపోయారు. వీరికి అప్పటికే పిల్లలున్నారు. వారిని భార్యదగ్గరే వదిలేశాడు. ఆ తరువాత భర్త మరో మహిళను వివాహం చేసుకున్నాడు, ఆమెకు అప్పటికే ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆ తరువాత ఇరు కుటుంబాల పెద్దలు వీరిని కూర్చోబెట్టి మాట్లాడడంతో మళ్లీ మొదటి భార్యతో భర్తకు సయోధ్య కుదిరింది. అప్పటినుంచి వీరంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.
ఈ క్రమంలో మొదటి భార్య పెద్ద కుమారుడు (మైనర్), బాధిత బాలిక (12).. సవతి సోదరి అయ్యే అమ్మాయి మీద అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో బాధితురాలు గర్భం దాల్చింది. దీంతో విషయం కుటుంబీకులకు తెలిసింది. దీనికి కారణం సవతి సోదరుడే అని తెలిసిన వారు ఏమీ చేయలేదు. సరికగా బాలికకు తొమ్మిది నెలలు నిండిన తర్వాత ప్రసవం కోసం సోమవారం నెల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. విషయం తెలుసుకున్న వైద్యులు షాక్‌కు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఇదిలా ఉండగా, జైపూర్ లో ఏప్రిల్ 8న ఇలాంటి ఓ కేసు వెలుగులోకి వచ్చింది. తన కూతుర్ల పట్ల ఓ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. వావివరుసలు మరచి ఇద్దరు daughterళ్లను లైంగికంగా వేధించాడు. ఏకంగా మూడు దశాబ్దాల నుండి అతను తన కూతురిని వేధింపులకు గురి చేస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన rajastanలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసు అధికారి జుల్ఫికర్ వివరాలు తెలుపుతూ… జోధ్ పూర్ లోని chopasni హౌసింగ్ బోర్డు పరిధిలో కన్న తండ్రి తన ఇద్దరు కూతుళ్లను లైంగికంగా వేధించాడు.
పెద్ద కూతురు ఆరు సంవత్సరాల వయసు నుంచే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. 1993లో తనపై అత్యాచారం చేశాడని.. ఈ విషయం తన తల్లికి చెప్పిన పట్టించుకోలేదన్నారు. కాగా బాధితురాలి 2017 లో వివాహం అయింది. దీంతో ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత అతడు కన్ను ఆమె చెల్లెలిపై పడింది. తాజాగా ఆమెను కూడా తండ్రి లైంగికంగా వేధించినట్లు ఆమె ఆరోపించింది. దీంతో తన సోదరిని రక్షించాలని బాధితురాలు (అక్క) పోలీసులను ఆశ్రయించింది. కాగా, ఆమె ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద తండ్రిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు.