ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ముగిసింది.కర్ణాటక రాష్ట్రంలోకి యాత్ర ప్రవేశించింది. రాష్ట్రంలో 120 కి.మీ పాదయాత్ర సాగింది. రెండు రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో పాదయాత్ర ముగియనుంది.
కర్నూల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న భారత్ జోడో శుక్రవారంనాడు ముగిసింది. ఇవాళ ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాహుల్ గాంధీ పాదయాత్ర కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించింది.ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్ర సరిహద్దులోని తుంగభద్రనదిపై ఉన్న బ్రిడ్జిపై నుండి కర్ణాటక రాష్ట్రంలోకి పాదయాత్ర ప్రవేశించింది.ఈ నెల 18 వ తేదీన ఉమ్మడి కర్నూల్ జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో పాదయాత్ర ప్రవేశించింది.మూడురోజుల పాటు సుమారు 119 కి.మీ.లకు పైగా రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు .ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఈ నెల 14 వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ పాదయాత్ర పాక్షికంగా సాగింది. కర్ణాటక రాష్ట్రం నుండి అనంతపురం జిల్లాలోని డి.హీరేలాల్ మండలం ఓబులాపురం గుండా ఏపీలోకి ప్రవేశించింది. అదే రోజు డి.హీరేలాల్ మండలంలో 18 కి.మీ పాదయాత్ర నిర్వహించిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత ఈ నెల 18వ తేదీన యాత్ర మళ్లీ ప్రవేశించింది.
ఇవాళ ఉదయం 19 కి.మీ పాదయాత్ర సాగింది. ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులోని మాధవరం గ్రామంలో ఇందిరమ్మ అనే మహిళ ఇంట్లో రాహుల్ గాంధీ టీ తాగారు. మాధవరం గ్రామ సమీపంలో కర్ణాటక,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న తుంగభద్ర నదిపై ఉన్న బ్రిడ్జిపై నుండి కర్ణాటక రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించింది.
undefined
రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశాలపై రాహల్ గాంధీ స్పష్టమైన హామీలు ఇచ్చారు.
కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూరు జిల్లాలో రాహుల్ పాదయాత్ర సాగనుంది. ఈ నెల 23న రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించనుంది. రాహుల్ గాంధీ పాదయాత్ర ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గం గుండా తెలంగాణ రాష్ట్రంలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ నెల 23 వ తేదీ మధ్యాహ్నం వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహిస్తారు. మూడు రోజుల పాటు పాదయాత్ర బ్రేక్ ఇస్తారు. ఈ నెల 24,25,26 తేదీల్లో పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు రాహుల్ గాంధీ.దీపావళిని పురస్కరించుకొని తన కుటుంబ సభ్యులతో పండుగను నిర్వహించుకొనేందుకు రాహుల్ గాంధీ మూడు రోజుల పాటు పాదయాత్రకు బ్రేక్ ఇస్తారు. ఈ నెల 26న సాయంత్రం ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి రాహుల్ గాంధీ చేరకుంటారు. శంషాబాద్ విమానాశ్రయం నుండి రాహుల్ గాంధీ మక్తల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చేరుకుంటారు. ఈ నెల 27 నుండి పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఈ నెల 4,5 తేదీల్లో కూడా రాహుల్ గాంధీ తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని పాదయాత్రకు రెండు రోజుల పాటు రాహుల్ గాంధీ బ్రేక్ ఇచ్చారు.ఈ నెల 6న రాహుల్ గాంధీ పాదయాత్రలో సోనియా గాంధీ కూడ పాల్గొన్నారు.
also read:ఏపీలో రెండో రోజూ భారత్ జోడో యాత్ర: భారీ వర్షంలోనే రాహుల్ పాదయాత్ర
ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం వరకు పాదయాత్ర సాగనుంది. దేశంలోని పలు రాష్ట్రాల గుండా రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.ఇప్పటికే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పాదయాత్ర ముగిసింది.రెండు రోజుల్లో కర్ణాటక రాష్ట్రంలో పాదయాత్ర ముగియనుంది.