సీఎం జగన్ బాహుబలి, మంత్రి గౌతంరెడ్డి సైరా నరసింహారెడ్డి: రోజా పొగడ్తలు

By Nagaraju penumalaFirst Published Aug 21, 2019, 3:17 PM IST
Highlights

రాష్ట్రంలో 300 ఎంఎస్ఎం పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్లు రోజా స్పష్టం చేశారు. ఇప్పటికే 33 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. స్థానికుల ఉద్యోగాల విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై పారిశ్రామిక వేత్తలు ఆలోచించాలని హితవు పలికారు. 
 

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఎమ్మెల్యే రోజా. సీఎం జగన్ ను  బాహుబలితో పోల్చారు. వైయస్ జగన్ పెద్ద పారిశ్రామిక వేత్తలని చెప్పుకొచ్చారు. స్వతహాగా పారిశ్రామిక వేత్త అయిన జగన్ పరిశ్రమలకు సంబంధించి మంచి పారిశ్రామిక పాలసీలు తీసుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాయలంలో జరిగిన పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఏపీఐఐసీ చైర్మన్ హోదాలో హాజరయ్యారు ఎమ్మెల్యే రోజా. నిర్ణీత సమయంలో పారిశ్రామిక వేత్తలకు అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు. పైసా లంచం తీసుకోకుండా అనుమతులు ఇవ్వాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. 

రాష్ట్రంలో 300 ఎంఎస్ఎం పార్కులు ఏర్పాటు చేయబోతున్నట్లు రోజా స్పష్టం చేశారు. ఇప్పటికే 33 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. స్థానికుల ఉద్యోగాల విషయంలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని వాటిపై పారిశ్రామిక వేత్తలు ఆలోచించాలని హితవు పలికారు. 

గత ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కో పరిశ్రమలకు ఒక్కో రకమైన పాలసీ ఇచ్చి రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన రనెండు నెలలు కాకకముందే పరిశ్రమలు తలిపోతున్నాయని టీడీపీ ఆరోపణలు చేయడం అర్థరహితమన్నారు. 

పరిశ్రమలకి గత ప్రభుత్వం అధిక రాయితీలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతీ మూడు నెలలకొకసారి పారిశ్రామిక వేత్తలని కలిసి సమస్యలు తెలుసుకుంటామని హామీ ఇచ్చారు. స్కిల్ డవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయడంతోపాటు నూతన పారిశ్రామిక విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డిపైనా ప్రశంసలు కురిపించారు రోజా. గౌతంరెడ్డి సైరా నరసింహారెడ్డి లాంటి వారని అభివర్ణించారు. గౌతంరెడ్డి కూడా మంచి బిజినెస్ మేన్ అని ఆయన కూడా మంచి  పారిశ్రామిక పాలసీ తీసుకువచ్చేందుకు కృషి చేస్తారని ఏపీఐఐసీ చైర్మన్ రోజా స్పష్టం చేశారు. 

click me!