వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాడేపల్లి: వాలంటీర్లపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ పోసాని కృష్ణమురళి డిమాండ్ చేశారు. వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నైతిక విలువలుంటే క్షమాపణలు చెప్పలని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారంనాడు తాడేపల్లిలో ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పు బట్టారు . వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ చాలా అసభ్యంగా మాట్లాడారన్నారు.పవన్ కళ్యాణ్ ను పొరపాటున కూడ సీఎం చేయనివ్వరని పరోక్షంగా చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీ అంటే చంద్రబాబుకు కోపమన్నారు.
undefined
also read:మహిళల మిస్సింగ్‌కు, అక్రమ రవాణాకు తేడా తెలుసా: పవన్ కు రోజా కౌంటర్
సినీ ఇండస్ట్రీలో ఆడవాళ్లను తిట్టిన వాళ్లపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓటమికి టీడీపీయే కారణమని ఆయన ఆరోపించారు. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు ఏపీ సీఎంగా జగన్ ఉంటారని ఆయన చెప్పారు. డేటా చౌర్యం చేసిన చరిత్ర చంద్రబాబు, లోకేష్ లదేనని పోసాని కృష్ణమురళి గుర్తు చేశారు. పవన్ తరపున చిరంజీవి చాలా మందికి క్షమాపణలు చెబుతున్నారన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో లక్షల మంది డేటా హైద్రాబాద్ కు వచ్చిందన్నారు. జగన్ ను విమర్శించడమే పనిగా పవన్ కళ్యాణ్ పెట్టుకున్నారన్నారు.