సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..!

Published : Jul 12, 2023, 11:29 AM IST
సీఎం జగన్ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..!

సారాంశం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు. కేబినెట్ భేటీ ఎజెండాలో మొత్తం 65 అంశాలు ఉన్నాయి. ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపిన పలు ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇందులో హైడ్రో స్టోరేజి, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు,హోటళ్లు, రిసార్టులు కోకాకోలా బెవేరేజెస్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడంపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. అమరావతిలో ఇళ్ల నిర్మాణంపై (ఆర్-5 జోన్) అంశంపై కూడా కేబినెట్‌లో చర్చించనున్నారు. 

భూమిలేని నిరూపేదలకు అసైన్డ్, లంక భూముల పంపిణీ ప్రతిపాదనపై కేబినెట్ చర్చించనుంది. టోఫెల్ శిక్షణకు సంబంధించిన ఒప్పందాలను మంత్రివర్గం సమీక్షించి.. ఆమోదం తెలపనున్నట్టుగా సమాచారం. నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలినుందని తెలుస్తోంది. 

కేబినెట్ భేటీ తర్వాత తాజా రాజకీయ పరిణామాలపై సీఎం జగన్ మంత్రులతో చర్చించే అవకాశం ఉంది. మరో ఏడాదిలోపే అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో అనుసరించాల్సిన వ్యుహాలపై కూడా మంత్రులకు దిశానిర్దేశం చేసే అవకాశం కూడా ఉందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!