వైఎస్ ఆశయాల కోసమే కాంగ్రెస్‌లో చేరా : ఇడుపులపాయలో వైఎస్ షర్మిల

By Siva Kodati  |  First Published Jan 20, 2024, 8:04 PM IST

తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని వైఎస్ షర్మిల తెలిపారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నిలబడాలని, దేశానికి మంచి జరగాలనే ఆ పార్టీలో చేరానని ఆమె వెల్లడించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు పోరాడతామని షర్మిల పేర్కొన్నారు. 


తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని వైఎస్ షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆదివారం బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఆమె శనివారం ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద ఆమె నివాళులర్పించారు. ఏపీ పీసీసీ చీఫ్‌గా నియమితులైన అనంతరం తొలిసారిగా సొంత జిల్లాకు వచ్చిన షర్మిలకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సీనియర్ నేతలు శైలజానాథ్, తులసి రెడ్డి, గౌతమ్, అహ్మదుల్లా తదితరులు స్వాగతం పలికినవారిలో వున్నారు. 

అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ ఆశీస్సుల కోసమే ఇడుపులపాయకు వచ్చానని తెలిపారు. రాజశేఖర్ రెడ్డికి కాంగ్రెస్, ఆ పార్టీ సిద్ధాంతాలంటే ప్రాణమని.. ఇందుకోసం ఎంతదూరమైనా వెళ్లేవారని షర్మిల చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు నిలబడాలని, దేశానికి మంచి జరగాలనే ఆ పార్టీలో చేరానని ఆమె వెల్లడించారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు పోరాడతామని షర్మిల పేర్కొన్నారు. 

Latest Videos

మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు అందరం కలిసి పనిచేస్తామని ఆయన వెల్లడించారు. కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ.. పేదల కోసం వైఎస్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దిక్సూచిలా పనిచేశారని, వైఎస్ ఆశయాల సాధన, రాహుల్‌ గాంధీని ప్రధానిగా చేసేందుకే షర్మిల కాంగ్రెస్‌లో చేరారని కేవీపీ రామచంద్రరావు అన్నారు. 

click me!