త్యాగాలు చేయాలి.. కాంగ్రెస్ నేతలతో రఘువీరా

Published : Nov 28, 2018, 10:38 AM ISTUpdated : Nov 28, 2018, 10:48 AM IST
త్యాగాలు చేయాలి.. కాంగ్రెస్ నేతలతో రఘువీరా

సారాంశం

తెలంగాణలో మాదిరిగానే.. ఏపీలో కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుదనే విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.

తెలంగాణలో మాదిరిగానే.. ఏపీలో కాంగ్రెస్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుదనే విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.  ఈ విషయాన్ని పార్టీ నేతలకు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా స్వయంగా వెల్లడించారు. ఇప్పటికే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉంది అన్న విషయాన్ని జనాలు పూర్తిగా మర్చిపోయారు. గత ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా ఎవరికీ దక్కలేదు.

ఈ నేపథ్యంలో.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే నయమని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఓడిపోవడం కన్నా పొత్తు చాలా నయమని వారు తమ అభిప్రాయాన్ని రఘువీరారెడ్డితో చెప్పినట్లు సమాచారం. మంగళవారం రఘువీరా రెడ్డి.. ఉత్తరాంద్ర కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో.. టీడీపీతో పొత్తుపై నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు.

ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ రాష్ట్రంలో టీడీపీతో పొత్తు ఉంటుంది. పార్టీ బలంగా ఉన్న చోట, కచ్చితంగా గెలుస్తారు అన్నవారికి  మాత్రమే టికెట్లు దక్కుతాయి. నాలాంటి సీనియర్లకు మాత్రమే టికెట్లు దక్కేఅవకాశం ఉంది. మిగిలిన వారు త్యాగాలు చేయాల్సి ఉంటుంది’’ అని చెప్పినట్లు తెలుస్తోంది.

అయితే..దీనికి కొందరు నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా.. రఘువీరా సర్ది చెప్పినట్లు సమాచారం. టికెట్ రాకపోయినప్పటికీ బాధపడకూడదని.. పార్టీకి సేవ చేసిన కొందరికి నామినేటెడ్ పదువులు దక్కేలా కృషి చేస్తానని రఘువీరా హామీ ఇవ్వగా.. పొత్తుకు అందరూ సంఘీభావం తెలిపినట్లు సమాచారం

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే