విజయవాడలో మావోల కలకలం... ఇద్దరు అరెస్ట్

Published : Nov 28, 2018, 10:18 AM IST
విజయవాడలో మావోల కలకలం... ఇద్దరు అరెస్ట్

సారాంశం

విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. 

విజయవాడలో మావోయిస్టుల కలకలం రేగింది. ఇద్దరు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్, ఆయన భార్య సారమ్మ అలియాస్ సుజాతను తెలంగాణ ఇంటిలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ ఇద్దరు మావోయిస్టులు విజయవాడలో సంచరిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు దాడులు చేసి అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు ఇద్దరినీ విచారణ నిమిత్తం కొత్తగూడెంకు తరలించారు. అరెస్టు అయిన మావోయిస్టులు ఏటూరు నాగారం, కొత్తగూడెం ఏరియా మావోయిస్టు ప్రతినిధులుగా పనిచేసినట్లు సమాచారం. ఏ పనిమీద విజయవాడ వచ్చారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

AP Power Sector : ఏపీకి కొత్త పవర్ ప్లాన్.. తీరనున్న కరెంట్ కష్టాలు..భవిష్యత్ కోసం బ్యాటరీ స్టోరేజ్
IRCTC Tirupati Kolhapur Tour: ఒక్క టికెట్ తో తిరుమల శ్రీవారి నుంచి కొల్హాపూర్ అమ్మవారి దర్శనం వరకు.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్