AP ZPTC MPTC Election Results: తాడికొండలో ఉండవల్లి శ్రీదేవికి బిగ్ షాక్.. ఎంపిటీసీలు కైవసం చేసుకున్న టీడీపీ...

By AN TeluguFirst Published Nov 18, 2021, 1:11 PM IST
Highlights

రాజధాని వైసీపీ ఎమ్మెల్యే Undavalli Sridevi కి సొంత నియోజకవర్గంలో (తాడికొండ) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఫిరంగిపురం మండలంలో రెండు ఎంపిటీసీ స్థానాలుండగా, ఈ రెండు చోట్లా టీడీపీ జెండా ఎగిరింది. ఈ రెండు స్థానాలను అధికార YCP ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసుకున్నప్పటికీ ఏ మాత్రం వారి ప్రయత్నాలు ఫలించలేదు.

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ వెలువడుతున్న MPTC, ZPTC ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ ఎంపీటీసీ స్థానాల్లో TDP జెండా ఎగిరింది. వైసీపీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రుల స్వగ్రామాల్లో సైతం టీడీపీ జెండా ఎగరడం గమనార్హం. ఇప్పటికే సర్పంచ్, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇదే జరగ్గా, తాజాగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లోనూ సేమ్ సీన్ రిపీటయ్యింది. 

ఊహించని షాక్...
రాజధాని వైసీపీ ఎమ్మెల్యే Undavalli Sridevi కి సొంత నియోజకవర్గంలో (తాడికొండ) ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఫిరంగిపురం మండలంలో రెండు ఎంపిటీసీ స్థానాలుండగా, ఈ రెండు చోట్లా టీడీపీ జెండా ఎగిరింది. ఈ రెండు స్థానాలను అధికార YCP ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసుకున్నప్పటికీ ఏ మాత్రం వారి ప్రయత్నాలు ఫలించలేదు. గుండాలపాడులో 457 ఓట్లు, వేమవరం 93 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు.

కాగా, రాజధాని నియజకవర్గంలో రెండు స్థానాల ఓటమితో వైసీపీ డీలీ పడినట్లయ్యింది. ఈ ఓటమితో వైసీపీ పెద్దల నుంచి శ్రీదేవికి పెద్ద ఎత్తున ఫోన్లు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఓటమిపై శ్రీదేవి ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. మరోవైపు టీడీపీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 10 జెడ్పీటీసీ, 123 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం పరిషత్ ఎన్నికలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వివిధ కారణాలతో అప్పట్లో ఆగిపోయిన, గెలిచినవారు చనిపోయిన కారణంగా ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికల సంఘం మంగళవారం పోలింగ్ జరిపింది.

మొత్లం.. 14 జడ్పీటీసీల్లో 04 ఏకగ్రీవం కాగా.. 10 స్థానాలకు పోలింగ్‌ జరిగింది. 176 ఎంపీటీసీల్లో 50 ఏకగ్రీవం అయ్యాయి.. అయితే మరో 3 స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు.. దీంతో మిగిలిన 123 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. 

YS Jagan: కుప్పం ఫలితాల తర్వాత చంద్రబాబు మొహం చూడాలన్న సీఎం జగన్.. బీఏసీలో ఆసక్తికర చర్చ..

పోలింగ్ జరిగిన స్థానాలకు నేడు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎంపీటీసీ స్థానాల్లో ఫలితాలు ఉదయం పది10.30 గంటల వరకు వెల్లడయ్యే అవకాశం ఉందని.. జెడ్పీటీసీ స్థానాల్లో మధ్యాహ్నం 1 గంటల వరకు తుది ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

10 జెడ్పీటీసీ స్థానాల్లో 40 అభ్య‌ర్థులు పోటీ ప‌డుతుండ‌గా, 123 ఎంపీటీసీ స్థానాల్లో 328 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు.  శ్రీకాకుళం జిల్లాలో 1 జెడ్పీటీసీ స్థానానికి, 13 ఎంపీటీసీ స్థానాలకు, విజయనగరం జిల్లాలో 09 ఎంపీటీసీ స్థానాలకు, విశాఖపట్నంలో 1  జెడ్పీటీసీ స్థానానికి, 06 ఎంపీటీసీ స్థానాలకు, తూర్ప గోదావరిలో 20 ఎంపీటీసీ స్థానాలకు, పశ్చిమ గోదావరిలో 1  జెడ్పీటీసీ స్థానానికి, 14 ఎంపీటీసీ స్థానాలకు, కృష్ణా జిల్లాలో 3  జెడ్పీటీసీ స్థానాలకు, 7 ఎంపీటీసీ స్థానాలకు, గుంటూరులో 1  జెడ్పీటీసీ స్థానానికి, 11 ఎంపీటీసీ స్థానాలకు,  ప్రకాశంలో 7 ఎంపీటీసీ స్థానాలకు, నెల్లూరులో 4 ఎంపీటీసీ స్థానాలకు,  చిత్తూరులో 1  జెడ్పీటీసీ స్థానానికి, 8 ఎంపీటీసీ స్థానాలకు, కడపలో 1 ఎంపీటీసీ స్థానానికి, కర్నూలులో 1  జెడ్పీటీసీ స్థానానికి,  7 ఎంపీటీసీ స్థానాలకు, అనంతపురంలో 1  జెడ్పీటీసీ స్థానానికి, 16 ఎంపీటీసీ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది.
 

click me!