మహిళా వాలంటీర్-కమీషనర్ వివాదం... రంగంలోకి వైసిపి ఎమ్మెల్యే గోపిరెడ్డి (వీడియో)

By Arun Kumar PFirst Published Aug 30, 2021, 11:47 AM IST
Highlights

నరసరావుపేట మున్సిపల్ కమీషనర్‌, వాలంటీర్ వివాదంపై స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పదించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. 

గుంటూరు జిల్లాలోని నరసరావుపేటలో ఓ మహిళా వాలంటీరు పట్ల స్థానిక మున్సిల్ కమీషనర్ దురుసుగా ప్రవర్తించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పందించి మహిళా వాలంటీర్ కు భరోసా ఇచ్చారు. దీంతో మునిసిపల్ కమిషనర్-వాలంటీర్ వివాదం సద్దుమణిగింది. 

ఈ వివాదానికి సమన్వయ లోపమే కారణమని తెలుపుతూ మహిళా వాలంటీర్ షేక్ అక్తర్ మరో వీడియో ద్వారా స్పష్టం చేసింది. ఉన్నతాధికారితో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తక్షణమే స్పందించారని... తనకు న్యాయం చేస్తారని నమ్మకం ఉందని వాలంటీర్ తెలిపారు. ఎమ్మెల్యే హామీ మేరకు తాను యధావిధిగా విధులకు హాజరవుతానని మహిళా వాలంటీర్ తెలిపారు.

మునిసిపల్ కమిషనర్ మందలించిన నేపధ్యంలో మనస్తాపం కలిగినప్పటికీ ఎమ్మెల్యే న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో సంతృప్తి చెందానని వాలంటీర్ తెలిపారు. ఇక ముందు కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచించినట్లు వాలంటీర్ తెలిపారు. తన క్లస్టర్ లోని ప్రజలకు ఎప్పటిలాగే నిరంతర సేవలందిస్తానని వాలంటీర్ షేక్ అక్తర్ తెలియజేశారు. 

వీడియో

ఈ ఘటనకు సంబంధించిన వివరాలలోకి వెళితే... నరసరావుపేటకు చెందిన షేక్ అక్తర్ అనే మహిళ 3వ వార్డులో వాలెంటీరుగా విధులు నిర్వర్తిస్తుంది. ఐతే అక్కడి అడ్మిన్ గా పనిచేసే నవ్య అనే సచివాలయ ఉద్యోగి తనపై ఫిర్యాదు చేయడంతో కమీషనర్ తనతో అసభ్యంగా మాట్లాడారని మహిళా వాలెంటీరు ఆవేదన వ్యక్తం చేసింది. గత జనవరి నెలలో తాను విధులలో చేరినప్పటి నుండి తనకు నిర్ధేశించిన అన్నిపనులూ సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికీ ఎప్పుడూ సచివాలయంలోనే అందుబాటులో ఉండాలంటూ తనను వార్డ్ అడ్మిన్ వేధింపులకు గురిచేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

గతంలో 3 వ వార్డు వాలంటీర్లు అందరూ అడ్మిన్ పై కమీషనర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆ కక్ష మనసులో పెట్టుకుని తమను మరిన్ని వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె తెలియజేశారు. వార్డు అడ్మిన్ చెప్పారని కమీషనర్ తనను బూతులు మాట్లాడుతూ నీకు దిక్కున్న చోట చెప్పుకో మంటూ... బొక్కలో వేసి తోలు వలిపిస్తా.. అంటూ బెదిరిస్తున్నారని మహిళా వాలెంటీరు ఆవేదన వ్యక్తం చేశారు.  

click me!