వైసీపీ ప్రభుత్వం ప్రతీ రైతుబజార్ లో కిలో రూ.25కే ఉల్లిని సరఫరా చేస్తోందని చెప్పుకొచ్చారు. కానీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ షాపులలో కిలో ఉల్లి రూ.200కు అమ్ముతున్నారని వీరా ప్రజల కష్టాల గురించి మాట్లేడదంటూ జగన్ ఆగ్రమం వ్యక్తం చేశారు.
అమరావతి: ఉల్లి ధరలపై ఏపీ అసెంబ్లీ దద్దరిల్లుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉల్లిధరలు ఆకాశాన్నంటుతుండటంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉల్లిధరల నియంత్రణలో ప్రభుత్వం తీవ్రంగా వైఫల్యం చెందిందంటూ టీడీపీ ఆరోపించింది.
తెలుగుదేశం పార్టీ ఆరోపణలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఘాటుగా సమాధానం చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ప్రతీ రైతుబజార్ లో కిలో రూ.25కే ఉల్లిని సరఫరా చేస్తోందని చెప్పుకొచ్చారు. కానీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు చెందిన హెరిటేజ్ షాపులలో కిలో ఉల్లి రూ.200కు అమ్ముతున్నారని వీరా ప్రజల కష్టాల గురించి మాట్లేడదంటూ జగన్ ఆగ్రమం వ్యక్తం చేశారు.
undefined
దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రం కూడా తమ ప్రభుత్వంలా ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిని కొనుగోలు చేసి తక్కువ ధరకు అమ్ముతున్న దాఖలాలు లేవని జగన్ చెప్పుకొచ్చారు. కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే కిలో రూ.25కు ఉల్లిని సరఫరా చేస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు 36వేల 536 క్వింటాళ్ల ఉల్లిపాయలను ఇతర రాష్ట్రాలను నుంచి కొనుగోలు చేసినట్లుు తెలిపారు.
నిరుద్యోగులకు జగన్ మరో శుభవార్త: మెగా నోటిఫికేషన్ కు రంగం సిద్ధం.
రాష్ట్రంలో ఉల్లిపాయలు దొరక్కపోవడంతో షోలాపూర్, అల్వాల్ ల నుంచి కూడా ఉల్లిపాయలు కొనుగోలు చేసినట్లు జగన్ తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో ఉల్లిపంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో ఉల్లిని పొలాల్లోనే వదిలేసిన దాఖలాలు ఉన్నాయన్నారు.
కానీ వైసీపీ ప్రభుత్వంలో రైతులు, కొనుగోలు దార్లు నష్టపోకుండా ఉన్నారని తెలిపారు. తమ దుకాణాల్లో రూ.200 కిలో ఉల్లిని అమ్ముతున్న చంద్రబాబు అసెంబ్లీలోకి వచ్చి ప్లకార్డులతో నిరసన తెలుపుతారా అంటూ నిలదీశారు. ఇంత అన్యాయమైన నాయకులను తాను చూడలేదన్నారు సీఎం జగన్.
AP Assembly : ఏపీ అసెంబ్లీలో "కేసీఆర్" రచ్చ