సుమారు 8వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదలకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పోస్టుల ఖాళీలపై దృష్టిపెట్టిన జగన్ సర్కార్ జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు లైన్ క్లియర్ చేసింది.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు మరో శుభవార్త తెలిపారు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు జగన్ సర్కార్ రంగం సిద్ధం చేస్తోంది.
సుమారు 8వేల పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదలకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పోస్టుల ఖాళీలపై దృష్టిపెట్టిన జగన్ సర్కార్ జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు లైన్ క్లియర్ చేసింది.
రాష్ట్రంలో 7వేల 900 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు మంత్రి ఆదిమూలపు సురేష్. డీఎస్సీ నోటిఫికేషన్ పై ఏపీ అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. దానికి స్పందించిన మంత్రి ఆదిమూలపు సురేష్ జనవరిలో భారీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు.
అసెంబ్లీలో హోదా రగడ: చిటికెలు వేసిన అచ్చెన్న, నాలుక మడతపెట్టొద్దన్న మంత్రి కన్నబాబు
ఇకపై ప్రతీఏడాది జనవరిలో విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఖాళీల భర్తీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఇకపోతే విద్యాశాఖలో భాషా పండితులకు పదోన్నతులు కల్పించినట్లు చెప్పుకొచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా 12వేల మంది భాషా పండితులకు పదోన్నతులు కల్పించిన మంత్రి సురేష్ వివరించారు. ప్రమోషన్లు లేక భాషా పండితులు ఇబ్బందులు పడుతున్నారని ఎన్నో ఏళ్ళుగా ప్రమోషన్ల కోసం వేచి చూస్తున్నారని వారి ఆశలను జగన్ నెరవేర్చారని చెప్పుకొచ్చారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ బలోపేతానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యాశాఖలో అనేక సంస్కరణలకు రంగం సిద్ధం చేసినట్లు చెప్పుకొచ్చారు. పేదలందరికీ ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో చరిత్ర సృష్టించినట్లు చెప్పుకొచ్చారు.
మరోవైపు ఉపాధ్యాయ, విద్యార్థుల నిష్పత్తి ప్రకారం అవసరమైన చోట అకడమిక్ ఇన్స్ట్రక్టర్ లను నియమించనున్నట్లు తెలిపారు. 2018 డీఎస్సీలో కొన్ని కోర్టు కేసులు ఉన్నాయని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు మంత్రి సురేష్.