పార్టీ మార్పుపై తేల్చేసిన గొట్టిపాటి

By narsimha lodeFirst Published Dec 9, 2019, 12:07 PM IST
Highlights

పార్టీ మారుతారని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పై చర్చ సాగుతోంది.ఈ తరుణంలో గొట్టిపాటి రవికుమార్ పార్టీ మార్పుపై తేల్చేశారు. 

అమరావతి: తనకు పార్టీ మారే ఆలోచన లేదని  టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి  రవికుమార్ స్పష్టం చేశారు. తనపై దాడులు జరిగినా తన వైఖరిలో ఎలాంటి మార్పులు లేవని ఆయన తేల్చి చెప్పారు.

సోమవారం నాడు అసెంబ్లీ లాబీల్లో  ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. తన రాజకీయ మార్పు లేదన్నారు. తాను పార్టీ మారుతున్నట్టుగా  బయట ఏదో ప్రచారం సాగుతోందన్నారు.  

Also read:చంద్రబాబుకు షాక్: వైసీపీలోకి ముగ్గురు ఎమ్మెల్యేలు, వారు వీరే...

తనకు పార్టీ మారాలనే ఆలోచనే లేదన్నారు. తన నా క్వారీల్లో అధికారులు తనిఖీలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఈ తనిఖీల వల్ల ఇబ్బందులున్నాయన్నారు. 
తన క్వారీలపై దాడులు జరిగినా తన రాజకీయ వైఖరిలో ఎలాంటి మార్పులు లేవన్నారు. తమ కుటుంబం క్వారీ వ్యాపారం చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 1990 నుండి తన తండ్రి ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. 

గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ బాటలో నడిచేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ఆ ముగ్గురు కూడా ప్రకాశం జిల్లాకు చెందినవారు కూడ విశేషం. ప్రకాశం జిల్లాకు చెందిన ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలతో  ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి చర్చలు జరిపినట్టుగా వార్తలు వచ్చాయి. 

ap assembly session: ఏపీ అసెంబ్లీ‌లో చంద్రబాబు వ్యాఖ్యలపై గందరగోళం

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి మాట్లాడారు. టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో ఆరుగురిని దూరం చేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదా గల్లంతవుతుంది. ప్రకాశం జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు నలుగురు ఉన్నారు. వారిలో ముగ్గురిని తమ పార్టీలోకి లాగేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తోందని మీడియాలో వార్తలు వచ్చాయి. .

చీరాల నుంచి కరణం బలరాం, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, పరుచూరు నుంచి ఏలూరి సాంబశివరావు, కొండపి నుంచి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గెలిచారు. వీరిలో ముగ్గురు వైసీపీకి వెళ్లే అవకాశం ఉంది. వారిలో ముగ్గురుని వైసీపీలోకి తెచ్చేందుకు మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని ప్రయత్నాలు చేస్తున్నారు 

అయితే  కరణం బలరాం తాను పార్టీ మారబోనని తన ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. గొట్టిపాటి రవికుమార్ కూడ ఇవాళ అసెంబ్లీ లాబీల్లో ఈ విషయమై ప్రకటించారు. .

click me!