ఆంధ్రా నిరుద్యోగులకు కొంచెం శుభవార్త

Published : Oct 10, 2017, 07:49 AM ISTUpdated : Mar 25, 2018, 11:59 PM IST
ఆంధ్రా నిరుద్యోగులకు కొంచెం శుభవార్త

సారాంశం

తొందర్లో  గ్రామ కార్యదర్శుల నియమాకం.  అయితే ఔట్ సోర్సింగ్ పద్ధతిలో...

ఆంధ్ర  ప్రదేశ్   నిరుద్యోగులకు రాష్ట్ర పంచాయతీ రాజ్  శాఖ మంత్రి నారా లోకేశ్ దీపావళి కానుక  ప్రకటించారు. రాష్ట్రంలో సుమారు 5,800ల గ్రామ కార్యదర్శుల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించిందని ఆయన వెల్లడించారు. అయితే,  ఔట్‌సోర్సింగ్‌ విధానంలో వీటి నియామకాలు జరుగుతాయి. గ్రామ పాలనలో కీలకమయిన గ్రామ కార్యదర్శి పదవులు భారీ సంఖ్యలో ఖాళీ గా ఉన్నాయి. ఇపుడు ఒక్కో కార్యదర్శి ని ఒకటి, రెండు గ్రామాలకు ఇన్‌చార్జిగా  పెట్టి పనిచేయిస్తున్నారు. పర్మనెంట్ రిక్రూట్ మెంటు లేకపోవడం అనేది  అంత శుభవార్త కాదు.ఔట్ సోర్సింగ్ అంటే ఏమయినా జరుగవచ్చు. రాజకీయా నాయకులు, అధికారులు తమకు నచ్చిన వారినే ఎంపిక చేయవచ్చు. రూలింగ్ పార్టీ రికమెండ్ చేసిన వారికి ఎక్కువ ఉద్యోగాలు రావచ్చు. ఎలాంటి రాజకీయ పలుకుబడి లేని వారికి ఈ ఉద్యోగాలు రావడం కష్టమవుతుంది. అందువల్ల లోకేశ్ ప్రకటించిన దీపావళి కానుక పేలుతుందా... అనేది ప్రశ్న. ఇప్పటికే రాజధాని ప్రాంతంలో వేల సంఖ్యలో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఒక ప్రాంతం వారినే నియమించారనే విమర్శ ఉంది.ఇలాంటపుడు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి  5800 పోస్టులను ఔట్ సోర్సింగ్ ద్వారా నియమిస్తారంటే కొంచెం అనుమానాలకు దారిస్తుంది.
డిగ్రీ అర్హతతో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఈ  నియమకాలు చేపడతారు. ప్రతి గ్రామానికీ ఓ కార్యదర్శి ఉంటే ప్రభుత్వ సేవలు మరింత బాగా అందించగలమని, అదే సమయంలో ప్రజలకు సౌలభ్యంగా ఉంటుందని మంత్రి నారా లోకేష్‌ అంటున్నారు. అందువల్ల తొందర్లోనే  నోటిఫికేషన్‌ వెలువడనుంది.
 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు