నవరత్నాల పేరుతో నవమోసాలు .. పేదల్ని బిచ్చగాళ్లని చేసేలా జగన్ సంక్షేమం : అచ్చెన్నాయుడు సెటైర్లు

Siva Kodati |  
Published : Sep 29, 2023, 04:49 PM IST
నవరత్నాల పేరుతో నవమోసాలు .. పేదల్ని బిచ్చగాళ్లని చేసేలా జగన్ సంక్షేమం : అచ్చెన్నాయుడు సెటైర్లు

సారాంశం

వైఎస్సార్ వాహనమిత్రపై విమర్శలు గుప్పించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అప్పులు, పన్నులు, ఆదాయం పెరిగినా సంక్షేమ ఖర్చు ఎందుకు తగ్గిందని అచ్చెన్నాయని నిలదీశారు. పేదల్ని బిచ్చగాళ్లని చేసేలా జగన్ బటన్ నొక్కుడు వుందన్నారు 

వైఎస్సార్ వాహనమిత్రపై విమర్శలు గుప్పించారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వాహనమిత్రతో ఇచ్చేది రూ.10 వేలు అయితే, కొట్టేస్తున్నది రూ.లక్ష అని వ్యాఖ్యానించారు. నవరత్నాల పేరుతో జగన్ నవమోసాలు చేశారని, చంద్రబాబు సంక్షేమానికి ఏటా బడ్జెట్‌‌లో రూ.18.21 శాతం ఖర్చు చేస్తే.. జగన్ 16.20 శాతం మాత్రమేనని అచ్చెన్నాయుడు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్ ప్రతీ ఏటా పెరుగుతున్నా సంక్షేమం బడ్జెట్‌ ఎందుకు తగ్గుతోందని ఆయన ప్రశ్నించారు. 

అప్పులు, పన్నులు, ఆదాయం పెరిగినా సంక్షేమ ఖర్చు ఎందుకు తగ్గిందని అచ్చెన్నాయని నిలదీశారు. పేదల్ని బిచ్చగాళ్లని చేసేలా జగన్ బటన్ నొక్కుడు వుందని.. చంద్రబాబు డ్రైవర్లకు ఇన్నోవా కార్లు ఇచ్చి యజమానిని చేస్తే, జగన్ 10 శాతం మంది డ్రైవర్లకు ఏటా పది వేలు ఇస్తున్నారని దుయ్యబట్టారు.  ధరలు, పన్నులు, జరిమానాలతో లక్ష లాక్కుంటున్నారని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. రైతు భరోసాతో రూ.7,500 ఇస్తూ.. రుణమాఫీ, డ్రిప్ ఇరిగేషన్ వంటి పథకాలు రద్దు చేశారని ఆయన దుయ్యబట్టారు. 

ALso Read: జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపెయిన్ ప్రారంభం .. ఇంటి వద్దే ఫ్రీగా పరీక్షలు , మందులు : వైఎస్ జగన్

అమ్మఒడితో రూ.13 వేలు ఇచ్చి నాన్న బుడ్డీలో రూ.70 వేలు కొట్టేస్తున్నారని అచ్చెన్నాయుడు సెటైర్లు వేశారు. రూ.3 వేల పెన్షన్ హామీని , ఏటా రూ. 250 పెంపుపైనా మాట తప్పారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 16 లక్షల మందికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇస్తే జగన్ ఇస్తున్నది పది లక్షల మందికేనని దుయ్యబట్టారు. చంద్రబాబు అమలు చేసిన 120 సంక్షేమ పథకాలు రద్దు చేశారని.. బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సబ్ ప్లాన్ నిధులు రూ.1.14 లక్షల కోట్లు దారి మళ్లించారని అచ్చన్నాయుడు ఆరోపించారు. 

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu