మీ గురించి ఢిల్లీలో టాక్ ఏంటో తెలుసా: విజయసాయిరెడ్డి అచ్చెన్న కౌంటర్

Siva Kodati |  
Published : Mar 18, 2021, 09:29 PM IST
మీ గురించి ఢిల్లీలో టాక్ ఏంటో తెలుసా: విజయసాయిరెడ్డి అచ్చెన్న కౌంటర్

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. అమరావతి భూముల వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. అమరావతి భూముల వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

'ట్విట్టర్‌లో పిచ్చి కూతలు కూసే బదులు మీ వెనుకున్న మురికిని చూసుకోండి సాయిరెడ్డీ' అంటూ అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. 10 ఏళ్ల నుంచి మీ దొంగ లెక్కల కేసును తేల్చమని మోదీని ఎందుకు అడగడం లేదని ఆయన ప్రశ్నించారు.

రెండేళ్ల నుంచి మూతి నొప్పని, ముడ్డి నొప్పని శుక్రవారం విచారణను ఎగ్గొట్టే జగ్గడు, నువ్వూ ఇంకొకరి గురించి చెప్పటమా? అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ముందు మీ కేసుల విచారణ గురించి ఆలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. మీరు జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని ఢిల్లీ టాక్ అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

అంతకుముందు చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'అవినీతికి పాల్పడి నానా అడ్డదారులు తొక్కే బదులు ఒక్క కేసునైనా ఎదుర్కొని నిర్దోషిగా బయటపడు చంద్రం' అని సెటైర్ వేశారు.

అసలు చట్టం ముందు నిలబడే దమ్ముందా? అని ప్రశ్నించారు. సిగ్గు లేకుండా వందోసారి స్టే కోసం ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజాకోర్టులో ఇంకా ఘోరమైన శిక్షలు తప్పవని అన్నారు. ఎమ్మెల్యేగా కూడా ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. మీకు ఇల్లే జైలు అయిపోతుందని అని చెప్పారు.

 

 

PREV
click me!

Recommended Stories

Tirupati : టీటీడీలో మరో భారీ కుంభకోణం.. నకిలీ పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల మోసం
IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్