వాటిపైనా కేసులేస్తే... ఆళ్ళకు దళిత రత్న బిరుదు: మాజీ మంత్రి జవహర్

Arun Kumar P   | Asianet News
Published : Mar 18, 2021, 05:16 PM IST
వాటిపైనా కేసులేస్తే... ఆళ్ళకు దళిత రత్న బిరుదు: మాజీ మంత్రి జవహర్

సారాంశం

మాజీ సీఎం చంద్రబాబుపై పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయడంపై మాజీ మంత్రి జవహర్ స్పందిస్తూ ఆళ్లపై విచుకుపడ్డారు. 

గుంటూరు: చట్టం ఫ్యాక్షన్ పాలకుల చేతిలో బంధి అయిందని...దళిత హక్కులు దళారుల చేతిల్లోకి వెళ్లిపోయాయని మాజీ మంత్రి కెఎస్ జవహర్ ఆరోపించారు. అమరావతి కోసం దళితుల అసైన్డ్ భూములను ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా లాక్కుందంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రారామకృష్ణారెడ్డి ఫిర్యాదుచేయగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఐడి నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా పలు సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు. దీనిపైనే స్పందిస్తూ ఆళ్లపై జవహర్ విచుకుపడ్డారు. 

''నిజంగానే ఆర్కేకు దళితులపై ప్రేమ వుంటే ఇడుపులపాయలో వైఎస్ కుటుంబం ఆక్రమించిన అసైన్డ్ భూములు నిరుపేదలకే తిరిగి ఇప్పించండి. అలాగే శిరోముండనాల గురించి ఆళ్ళ కేసువేస్తేదళిత రత్న బిరుదు ప్రదానం చేస్తాం. ఇలా చేయడం ఆళ్ల వల్ల కాదు. ఎందుకంటే ఆయన జగన్ ఆడిస్తున్న ఆటలో అరటి పండు'' అని ఎద్దేవా చేశారు. 

read more  అమరావతి అసైన్డ్ భూముల ఇష్యూ: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి భద్రత పెంపు

''విచారణ పేరుతో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వేదింపుల పర్వానికి తెర తీస్తున్నారు. ఆయనపై కక్షతోనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటి కేసులు పెట్టారు. ఈ తప్పుడు కేసులపై న్యాయ పోరాటానికి దిగిన చంద్రబాబుకు ప్రతి టిడిపి నాయకుడు, కార్యకర్తే కాదు ప్రజలు కూడా అండగా వుంటారు'' అని జవహర్ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్