గుడివాడ క్యాసినో రగడ.. చర్యలు తీసుకోకుంటే జగన్ చీటీ చిరగడం ఖాయం: అచ్చెన్నాయుడు

By Rajesh KFirst Published Jan 21, 2022, 5:13 PM IST
Highlights

గుడివాడ క్యాసినో (gudivada casino) నిర్వహణ గుట్టు విప్పేందుకు వెళ్లిన టీడీపీ (tdp) నిజనిర్ధారణ కమిటీ (fact finding committee) సభ్యులపై వైసీపీ గుట్కా బ్యాచ్ దాడి చేయడం దుర్మార్గమన్నారు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu)

గుడివాడ క్యాసినో (gudivada casino) నిర్వహణ గుట్టు విప్పేందుకు వెళ్లిన టీడీపీ (tdp) నిజనిర్ధారణ కమిటీ (fact finding committee) సభ్యులపై వైసీపీ గుట్కా బ్యాచ్ దాడి చేయడం దుర్మార్గమన్నారు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) . అసలు తప్పే జరగలేదు అని వాదిస్తున్నపుడు నిజనిర్ధారణ కమిటీని అడ్డుకోవాల్సిన అవసరం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. గంజాయి బ్యాచ్ ను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలపై హత్యా యత్నం చేశారని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. కాసినో గుట్టు బయట పడుతుందనే భయంతోనే గుడివాడ గుట్కా బ్యాచ్ వీరంగం వేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందరో మహానుభావులు నడయాడిన గుడివాడను గుట్కా బ్యాచ్ మట్కాకు, వ్యసనాలకు కేంద్రం చేసిందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. 

ఎన్.టీ.ఆర్. టూ వైఎస్సార్ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో పనికిమాలిన పనులు చేస్తూ.. ఎన్.టీ.ఆర్ పరువు తీస్తున్నారంటూ ఆయన దుయ్యబట్టారు.  క్యాసినో, జూదం, క్యాబరే డాన్స్‌లు పెట్టి యువత జీవితాలు నాశనం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఫైరయ్యారు. కొడాలి నాని కోడె తాచులా స్థానిక యువతను నాశనం చేస్తున్నాడని  ఆరోపించారు. కొడాలి నానికి చెందిన ఫంక్షన్ హాల్లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను వీడియోలు, సాక్ష్యాలతో సహా బయట పెట్టినా పోలీసులు చర్యలు తీసుకోలేని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. 

ఇప్పుడు మంత్రి నిస్సిగ్గుగా అక్కడేం జరగలేదు అంటూ బుకాయిస్తున్నాడని...  బహిరంగంగా గుడివాడలో క్యాసినో, జూదం, క్యాబరే నడిపిస్తూ ఉంటే ముఖ్యమంత్రికి కనిపించడం లేదా.? అని ఆయన ప్రశనింనచారు. క్యాసినో నుండి వచ్చే కమీషన్లకు కక్కుర్తిపడి అన్నీ తెలిసీ నిద్ర నటిస్తున్నారా అని అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులపై వైసీపీ గూండాలు దాడి చేస్తుంటే పోలీసులు పక్కనే ఉంది కూడా అడ్డుకొకపోవడం దుర్మార్గమన్నారు. 

క్యాసినో గుట్టు బయట పెట్టేందుకు వెళ్లిన టీడీపీ సభ్యులను అడ్డుకున్న పోలీసులకు అంత పబ్లిగ్గా దాడి చేస్తుంటే కనిపించలేదా.? అని ఆయన నిలదీశారు. టీడీపీ నేతలపై దాడి ఘటనలో మంత్రి కొడాలి నాని (kodali nani) , వైసీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని... కొడాలి నానిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. కొడాలి నాని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అరాచకాలు, పాపాలు ప్రజలు భరించే రోజులు పోయాయన్నారు. గుడివాడ క్యాసినో ఘటనలో చర్యలు తీసుకోకుంటే జగన్ రెడ్డి (ys jagan) చీటీ చిరగడం ఖాయమని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. 

కాగా.. ఈ క్యాసినో సెంటర్ నిర్వహణ విషయమై టీడీపీ నేతలు శుక్రవారం నాడు నిజ నిర్ధారణ చేయడానికి గుడివాడకు వచ్చారు. క్యాసినో  నిర్వహించిన కే కన్వెన్షన్ సెంటర్ వద్ద వైసీపీ శ్రేణులు భారీగా మోహరించాయి. టీడీపీ కార్యాలయం వద్ద టీడీపీ నేతలు మోహరించారు. టీడీపీ కార్యాలయం నుండి కె కన్వెన్షన్ సెంటర్ వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ మంత్రులు కొల్లు రవీంద్ర, నక్కా ఆనంద్ బాబు, ఆలపాటి రాజా, మాజీ ఎమ్మెల్యే  బొండా ఉమా మహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. 

casino నిర్వహించిన కె కన్వెన్షన్ సెంటర్ వద్దకు టీడీపీ నేతలు వెళ్లకుండా అడ్డుకొన్నారు. రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసి టీడీపీ నేతలు నిలువరించారు.అయితే ఈ సమయంలో టీడీపీ శ్రేణులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ కార్యాలయం వెనుక నుండి వైసీపీ శ్రేణులు భారీగా వచ్చారు. దీంతో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. వైసీపీ శ్రేణులు కుర్చీలు, రాళ్లతో దాడి వేశారు. వైసీపీ శ్రేణులను టీడీపీ శ్రేణులను ప్రతిఘటించేందుకు ప్రయత్నించారు,. అదే సమయంలో అక్కడే ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీచార్జీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు కారును వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశాయిటీడీపీ కార్యాలయం  వద్ద నుండి  వైసీపీ శ్రేణులను పంపించి వేశారు.

click me!