వైసీపీ 175 స్థానాల్లో గెలిస్తే .. టీడీపీ ఆఫీస్‌కి తాళం వేస్తాం: జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్

Siva Kodati |  
Published : Jun 09, 2022, 03:36 PM ISTUpdated : Jun 09, 2022, 03:37 PM IST
వైసీపీ 175 స్థానాల్లో గెలిస్తే .. టీడీపీ ఆఫీస్‌కి తాళం వేస్తాం: జగన్‌కు అచ్చెన్నాయుడు సవాల్

సారాంశం

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాలయానికి తాళం వేస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.  మ‌రి 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంద‌ని జ‌గ‌న్‌కు న‌మ్మ‌కం ఉందా అంటూ ఆయన చురకలు వేశారు. 

వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించాలంటూ వైసీపీ నేతలకు సీఎం జగన్ క్లాస్ పీకడంపై టీడీపీ (tdp) ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (atchannaidu) కీలక వ్యాఖ్యలు చేశారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చెబుతున్న‌ట్లుగా 175 స్థానాల్లో వైసీపీ గెలిస్తే టీడీపీ కార్యాల‌యానికి తాళాలు వేస్తామ‌ంటూ ఆయన సవాల్ విసిరారు. మ‌రి 175 స్థానాల్లో వైసీపీ గెలుస్తుంద‌ని జ‌గ‌న్‌కు న‌మ్మ‌కం ఉందా? అని అచ్చెన్నాయుడు ప్ర‌శ్నించారు. అదే న‌మ్మ‌కం ఉన్న‌ట్లైతే జ‌గ‌న్ ఇప్పుడే ఎన్నికల‌కు వెళ్లాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. త‌క్ష‌ణ‌మే గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేస్తున్న‌ట్లు జ‌గ‌న్ ప్ర‌క‌టించాల‌ని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. 

అయినా ఏం చేశార‌ని రాష్ట్ర ప్ర‌జ‌లు వైసీపీని 175 స్థానాల్లో గెలిపిస్తార‌ని ఆయన ప్ర‌శ్నించారు. మ‌రోమారు జ‌గ‌న్‌కు ఓట్లేసేంత అమాయ‌కులు ప్ర‌జ‌లు కాద‌ంటూ చురకలు వేశారు. టెన్త్ రిజ‌ల్ట్స్ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ త‌ప్పుల కార‌ణంగా మ‌నోవేద‌న‌కు గుర‌వుతున్న విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రుల్లో భ‌రోసా నింపేందుకు నారా లోకేశ్ జూమ్ మీటింగ్ నిర్వ‌హించారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమంలోకి వైసీపీ నేత‌లు దొంగ‌ల్లా ప్ర‌వేశించార‌ని అచ్చెన్నాయుడు ఎద్దేవా చేశారు. పిల్ల‌ల‌ను భ‌య‌పెట్టి జూమ్ కాన్ఫ‌రెన్స్‌లోకి చొర‌బ‌డ్డ వైసీపీ నేత‌ల‌పై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

Also Read:‘‘ గడప-గడపకు’’పై ఇంట్రెస్ట్ చూపని బొత్స, ఆళ్ల నాని, అనిల్ .. పీకే టీం ప్రజంటేషన్‌లో వెల్లడి

ఇకపోతే.. గడప-గడపకు కార్యక్రమంపై (gadapa gadapaku mana prabhutvam)  సీఎం వైఎస్ జగన్ (ys jagan) సమక్షంలో ఐప్యాక్ టీం (ipac team) బుధవారం ప్రజంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల పని తీరుపై తెలియజేసింది. ఎమ్మెల్యేలు ఎన్ని రోజులు నిర్వహించారన్న దానిపై ప్రజంటేషన్‌లో ప్రస్తావించారు. 10, 5 రోజుల కంటే తక్కువ గడప- గడపకు నిర్వహించిన వారిపై ఐప్యాక్ నివేదిక ఇచ్చింది. ఒక్కరోజు కూడా కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలు వున్నట్లు తెలిపిందింది. ఒక్కరోజు కూడా కార్యక్రమంలో పాల్గొనని వారిలో బొత్స సత్యనారాయణ, ఆళ్ల నాని, శిల్పా చక్రపాణి రెడ్డి, ప్రసన్న కుమార్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ వున్నారు. 

అనంతరం ఈ నివేదికపై సమావేశంలోనే స్పందించారు సీఎం జగన్. మొదటి నెల కావడంతో వదిలేస్తున్నానని వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని సూచించారు. 6 నెలల వరకు ఎమ్మెల్యేలపై పర్యవేక్షణ ఉంటుందని జగన్ అన్నారు. 6 నెలల తరువాత నివేదికను బట్టి చర్యలు ఉంటాయని సీఎం హెచ్చరించారు. మరోవైపు.. క్షేత్ర స్థాయిలో పర్యటించాలని సీఎం జగన్‌కు పలువురు ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!