పబ్లిసిటీకి కక్కుర్తి పడ్డారేమో... పాపం రానివ్వండి లోకేష్ గారు: కొడాలి నాని, వంశీలపై కొల్లు రవీంద్ర సెటైర్లు

Siva Kodati |  
Published : Jun 09, 2022, 02:33 PM ISTUpdated : Jun 09, 2022, 02:37 PM IST
పబ్లిసిటీకి కక్కుర్తి పడ్డారేమో... పాపం రానివ్వండి లోకేష్ గారు: కొడాలి నాని, వంశీలపై కొల్లు రవీంద్ర సెటైర్లు

సారాంశం

మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై మండిపడ్డారు టీడీపీ నేత కొల్లు రవీంద్ర. జూమ్ కాల్‌లో కనిపించైనా మీడియాలో పబ్లిసిటీ కోసం కక్కుర్తి పడుతున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు.   

తెలుగుదేశం పార్టీ (telugu desam party) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ (nara lokesh) పదో తరగతి విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో నిర్వహించిన జూమ్ వీడియో కాల్ మీటింగ్‌లోకి మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani), ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (vallabhaneni vamsi) ప్రత్యక్షం కావడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. దీనిపై ఇరు పార్టీలకు చెందిన నేతలు రకరకాలుగా స్పందిస్తున్నారు. 

తాజాగా... కొడాలి నాని, వల్లభనేని వంశీలపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (kollu ravindra) విమర్శలు గుప్పించారు. ఒకరికి పదవి లేదని, మరొకరికి ఏ పార్టీలో ఉన్నారో క్లారిటీ లేదంటూ చురకలు వేశారు. జూమ్ కాల్‌లో కనిపించైనా మీడియాలో పబ్లిసిటీ కోసం కక్కుర్తి పడుతున్నారని, పాపం.. రానివ్వండి లోకేశ్ గారూ అంటూ కొల్లు రవీంద్ర ట్వీట్ చేశారు. విద్య విలువ తెలియని మూర్ఖుని పాలనలో పదో తరగతి విద్యార్థుల ఆర్తనాదాలు వినిపించవని, వారి ఆత్మహత్యలు కనిపించవంటూ ఫైరయ్యారు. 

Also Read:రాజకీయ ప్రేరేపిత ఉపన్యాసాలతో పిల్లలను చెడగొట్టొద్దు: లోకేష్‌కి వల్లభనేని వంశీ సూచన

మరోవైపు ఈ వ్యవహారంపై వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు. విద్యార్ధులకు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరైందా అని ఆయన ప్రశ్నించారు.  విద్యార్ధులతో లోకేష్ ఏం మాట్లాడుతున్నారో చూద్దామనే తాను జూమ్ మీటింగ్ కు వచ్చానని స్పష్టం చేశారు. తప్పుడు ఐడీతో తాను జూమ్ మీటింగ్ లో జాయిన్ కాలేదని... తన ఫోన్ నుండే తాను జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యాయని వంశీ వెల్లడించారు. విద్యార్ధులకు ధైర్యం చెప్పకుండా రాజకీయ ఉపన్యాసాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. స్క్రిప్ట్ రాసుకొచ్చి లోకేష్ ఉపన్యాసం ఇస్తున్నారన్నారని.. మేం మాట్లాడింది చూపించడానికి లోకేష్‌కి ఏం భయమని వల్లభనేని వంశీ ప్రశ్నించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్