రాజకీయ ప్రేరేపిత ఉపన్యాసాలతో పిల్లలను చెడగొట్టొద్దు: లోకేష్‌కి వల్లభనేని వంశీ సూచన

Published : Jun 09, 2022, 02:07 PM IST
రాజకీయ ప్రేరేపిత ఉపన్యాసాలతో పిల్లలను చెడగొట్టొద్దు:  లోకేష్‌కి వల్లభనేని వంశీ సూచన

సారాంశం

రాజకీయ ప్రేరేపిత ఉపన్యాసాలతో పిల్లలను చెడగొట్టవద్దని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నారా లోకేష్ కు సూచించారు.  ఇవాళ టెన్త్ క్లాస్ విద్యార్ధులతో  లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీలు హాజరయ్యారు. 


అమరావతి: రాజకీయ ప్రేరేపిత ఉపన్యాసాలతో పిల్లలను చెడగొట్టొద్దని గన్నవరం ఎమ్మెల్యే Vallabhaneni Vamsi టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సూచించారు.

టెన్త్ క్లాస్ విద్యార్ధులతో  టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి Nara Lokesh నిర్వహించిన జూమ్ మీటింగ్ లో  మాజీ మంత్రి  Kodali Nani, గన్నవరం ఎమ్మెల్యే వలల్లభనేని వంశీ, YCP  నేత Devender Reddyలు ప్రత్యక్షమయ్యారు.  

గురువారం నాడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు. విద్యార్ధులకు ధైర్యం చెప్పకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరైందా అని ఆయన ప్రశ్నించారు.  విద్యార్ధులతో లోకేష్ ఏం మాట్లాడుతున్నారో చూద్దామనే తాను జూమ్ మీటింగ్ కు వచ్చానని చెప్పారు. 

also read:టెన్త్ విద్యార్థులతో లోకేష్ జూమ్ మీటింగ్: ఆకస్మాత్తుగా కొడాలి, వల్లభనేని ప్రత్యక్షం

తప్పుడు ఐడీతో తాను జూమ్ మీటింగ్ లో జాయిన్ కాలేదన్నారు. తన ఫోన్ నుండే తాను జూమ్ మీటింగ్ లో జాయిన్ అయ్యాయని వంశీ చెప్పారు.  విద్యార్ధులకు ధైర్యం చెప్పకుండా రాజకీయ ఉపన్యాసాలు చెబుతున్నారని ఆయన విమర్శించారు. స్క్రిప్ట్ రాసుకొచ్చి లోకేష్ ఉపన్యాసం ఇస్తున్నారన్నారు.  మేం మాట్లాడింది చూపించడానికి లోకేష్ ఏం భయమని ఆయన ప్రశ్నించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సైకిల్ పార్టీనా, సైకో పార్టీనా? ఆర్కే రోజా సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Ambati Rambabu Comments: సీఎం చంద్రబాబుపై అంబటి సెటైర్లు | Asianet News Telugu