రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు

By narsimha lodeFirst Published Jun 15, 2020, 2:34 PM IST
Highlights

ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని  నిర్ణయం తీసుకొన్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సోమవారం నాడు అమరావతిలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.


అమరావతి: ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని  నిర్ణయం తీసుకొన్నారు. ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన సోమవారం నాడు అమరావతిలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో అసెంబ్లీ నిర్వహణ, భద్రతపై చర్చించారు. ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ షరీఫ్‌, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య శాఖ సెక్రటరీ జవహర్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, విప్లు శ్రీనివాసులు, ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, పోలీస్‌ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

కరోనా నేపథ్యంలో అసెంబ్లీ నిర్వహణకు గాను ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొన్నామని ఆయన తెలిపారు. అసెంబ్లీ, మండలిలోని ప్రతి సీటును శానిటేషన్ చేస్తున్నామన్నారు. సభ్యులందరికీ కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

also read:రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు: టీడీఎల్పీ భేటీ, వ్యూహాంపై చర్చ

అసెంబ్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని స్పీకర్  తమ్మినేని సీతారాం చెప్పారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిబ్బందికి అసెంబ్లీ బయట ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

కరోనా కారణంగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకొంటున్నట్టుగా చెప్పారు. గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు.
 

click me!