ఏపీలో పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్: ఏప్రిల్ 8న పోలింగ్, 10న కౌంటింగ్

Siva Kodati |  
Published : Apr 01, 2021, 08:53 PM IST
ఏపీలో పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్: ఏప్రిల్ 8న పోలింగ్, 10న కౌంటింగ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ఎస్ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 8న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు  పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 9న అవసరమైన చోట రీ పోలింగ్ నిర్వహిస్తామని ఈసీ తెలిపింది. 

ఈ నెల 10న పరిషత్ ఎన్నికల ఫలితాలను వెల్లడించనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పాత ఏకగ్రీవాలు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.

126 జడ్పీటీసీ.. 2,371 ఎంపీటీసీ స్థానాల్లో ఏకగ్రీవాలు జరిగాయి. ఎంపీటీసీ ఎన్నికల బరిలో 19,002 మంది అభ్యర్ధులు వున్నారు. 513 జెడ్పీటీసీ.. 7,230 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జడ్‌పీటీసీ బరిలో 2,092 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. 

అంతకుముందు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని. గురువారం కలెక్టర్లు, ఎస్పీలతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె అభిప్రాయాలు తీసుకున్నారు.

ఎన్నికల తేదీలు, భద్రతా ఏర్పాట్లపై చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, టీకా పంపిణీ కార్యక్రమంపై వారు ఎస్ఈసీకి వివరించారు.

వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహిస్తే వ్యాక్సినేషన్‌పై ఫోకస్ పెడతామని నీలం సాహ్ని దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల నిర్వహణలో కోవిడ్ ప్రోటోకాల్‌ పాటిస్తామని వివరించారు. 
 
PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu