జగన్ ప్రభుత్వంతో ఢీ: రేపే నిమ్మగడ్డ పంచాయతీ నోటిఫికేషన్

By narsimha lode  |  First Published Jan 22, 2021, 2:45 PM IST

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేస్తోంది. ఈ నెల 23వ తేదీన తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది.
 


అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సర్వం సిద్దం చేస్తోంది. ఈ నెల 23వ తేదీన తొలి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వనుంది.వచ్చే నెలలో నాలుగు విడతలుగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈ మేరకు ఈ నెల 8వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. 

ఈ షెడ్యూల్ ప్రకారంగా ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత ఎన్నికల నిర్వహణకు గాను  ఈ నెల 23వ తేదీన నోటిఫికేషన్ జారీ  చేసేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.

Latest Videos

also read:నిమ్మగడ్డ పంచాయతీ: జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

ఎన్నికల సంఘం రాష్ట్ర కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈ నెల 23వ తేదీన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశంలోనే తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆటంకం కలిగే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇదే విషయమై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఎన్నికల నిర్వహణకు ఏపీ హైకోర్టు ధర్మాసనం ఈ నెల 21న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం గురువారం నాడే సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

ఎన్నికల నిర్వహణ విషయంలో హైకోర్టు ధర్మాసనం తీర్పుతో పాటు  ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు వ్యవహరించిన తీరు ఇతరత్రా అంశాలను గవర్నర్ దృష్టికి  ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ తీసుకెళ్లారు. 
 

click me!