నిమ్మగడ్డ పంచాయతీ: జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్

By narsimha lode  |  First Published Jan 22, 2021, 2:13 PM IST

 స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విషయమై ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం షాకిచ్చింది.
 


న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విషయమై ప్రభుత్వానికి ఉన్నత న్యాయస్థానం షాకిచ్చింది.

ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ మొత్తం తప్పుల తడకగా ఉందని ఆ పిటిషన్ ను సరిచేయాలని సుప్రీంకోర్టు సూచించింది. అంతేకాదు పిటిన్ ను వెనక్కి ఇచ్చేసింది. ఈ క్రమంలో ఇవాళే రిజిస్ట్రీ పిటిషన్ ను సరిచేసి దాఖలు చేయలేకపోవచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.

Latest Videos

సోమవారం వరకు పిటిషన్ దాఖలు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ ఆదివారం నాడు విడుదల కానుంది. 

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఐదు విడుతలుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ఏపీ ఎన్నికల సంఘం ఈ నెల 8వ తేదీన షెడ్యూల్ ప్రకటించింది.ఈ షెడ్యూల్ ను ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.

also read:ఏపీలో స్థానిక సంస్థల పంచాయితీ: సుప్రీంలో ఉద్యోగుల జేఏసీ పిటిషన్

సింగిల్ జడ్జి ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ఈ నెల 11న సస్పెండ్ చేశారు.ఈ ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం ముందు ఎన్నికల సంఘం సవాల్ చేసింది.

ఎన్నికలను నిర్వహించేందుకు ఏపీ హైకోర్టు ధర్మాసనం ఈ నెల 21న గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  ఏపీ హైకోర్టు ధర్మాసనం తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ గురువారం నాడే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

కరోనా వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఆ పిటిషన్ లో ప్రభుత్వం కోరింది. 
 

click me!