ఏపీ రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎన్నికల నిర్వహణకు తీసుకొంటున్న చర్యల గురించి ఆయన గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది.
అమరావతి: ఏపీ రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎన్నికల నిర్వహణకు తీసుకొంటున్న చర్యల గురించి ఆయన గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది.
ఏపీ రాష్ట్రగవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం నాడు భేటీ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, ఎన్నికల నిర్వహణకు తీసుకొంటున్న చర్యల గురించి ఆయన గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది. pic.twitter.com/Yo512eXxiM
— Asianetnews Telugu (@AsianetNewsTL)
అమరావతి: ఈ నెల 25వ తేదీన ఏపీలో ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం వేగంగా నిర్ణయాలు తీసుకొంటుంది. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఐఎఎస్ లపై కూడ ఎన్నికల సంఘం చర్యలకు సిఫారసు చేసింది.
also read:ఈ నెల 27న కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్
రాష్ట్ర ప్రభుత్వం కూడ ఎన్నికల నిర్వహణకు సిద్దమని ప్రకటించింది.ఈ నెల 8వ తేదీన ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. ఈ పరిణామాలన్నింటిని గవర్నర్ కు నిమ్మగడ్డ రమేష్ కుమార్ వివరించనున్నారు.
సీఎస్ కూడా గవర్నర్ వద్దకు
రాష్ట్ర ఎన్నికల సంఘం నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ తో భేటీ సమయంలోనే రాజ్ భవన్ కు సీఎస్ అథిత్యనాథ్ దాస్ కూడ రాజ్ భవన్ కు చేరుకొన్నారు. ఎన్నికల నిర్వహణకు గాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలను గురించి కూడ సీఎస్ గవర్నర్ కు వివరించే అవకాశం ఉంది. ఇద్దరు అధికారులు వేర్వేరుగానే గవర్నర్ తో భేటీ అయ్యారని తెలుస్తోంది.