భార్య కాపురానికి రాలేదని ఉరేసుకుని భర్త ఆత్మహత్య..

Published : Jan 27, 2021, 09:38 AM IST
భార్య కాపురానికి రాలేదని ఉరేసుకుని భర్త ఆత్మహత్య..

సారాంశం

భార్య కాపురానికి రావడం లేదన్న మనస్తాపంతో ఓ భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన  గుంటూరు జిల్లా తాడికొండలో జరిగింది. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో విషాదం నింపింది. 

భార్య కాపురానికి రావడం లేదన్న మనస్తాపంతో ఓ భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన  గుంటూరు జిల్లా తాడికొండలో జరిగింది. తాడికొండ మండలం నిడుముక్కల గ్రామంలో విషాదం నింపింది. 

తాడికొండ ఎస్‌ఐ జి.వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం మందపాడు గ్రామానికి చెందిన మేరుగ మరియదాసు(50)కి తాడికొండ మండలం నిడుముక్కల గ్రామానికి చెందిన నాగమణితో 30 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. 

వీరికి ఇద్దరు కుమార్తెలు. కుమార్తెల వివాహాలు జరిపి అప్పుల పాలయ్యాడు. నిడుముక్కల గ్రామంలో ఉన్న ఇంటిని అమ్మి అప్పులు తీర్చాలని మరియదాసు తన భార్యకు చెప్పగా నాగమణి అందుకు అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ గుంటూరులో వేర్వేరుగా ఉంటున్నారు. 

మంగళవారం  నిడుముక్కల గ్రామానికి వచ్చిన మరియదాసు వరండాలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటాద్రి తెలిపారు.     

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu
CM Chandrababu: నిధులు లేవని ప్రాజెక్ట్స్ నిలపకండి అధికారులకు సీఎం ఆదేశాలు | Asianet News Telugu