మున్సిపల్ ఎన్నికలను పురుస్కరించుకొని నామినేషన్ల ఉపసంహరణల విషయంలో జిల్లా కలెక్టర్లకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు కీలక ఆదేశాలను జారీ చేసింది.
అమరావతి: మున్సిపల్ ఎన్నికలను పురుస్కరించుకొని నామినేషన్ల ఉపసంహరణల విషయంలో జిల్లా కలెక్టర్లకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు కీలక ఆదేశాలను జారీ చేసింది.మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణల విషయంలో మంగళవారం నాడు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొంది.
also read:నిమ్మగడ్డకు హైకోర్టు షాక్: మునిపల్ ఎన్నికల్లో మళ్లీ నామినేషన్ల దాఖలు ఆదేశాల కొట్టివేత
నిన్న రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీల్లో భారీగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. బెదిరించి నామినేషన్లను ఉపసంహరింపజేశారని విపక్షాలు ఆరోపణలు చేశారు. దీంతో బుధవారం నాడు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు తాజా ఆదేశాలు జారీ చేశారు.
also read:పంచాయితీ ఎన్నికల రీ కౌంటింగ్: నిమ్మగడ్డ కీలక ఆదేశాలు
అభ్యర్ధి లేకుండా నామినేషన్ల ఉపసంహరణకు అనుమతి ఇవ్వొద్దని ఆదేశించింది. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియను మొత్తం వీడియో తీయాలని ఎస్ఈసీ కలెక్టర్లను కోరింది.