ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేసింది.
అమరావతి: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను రీ షెడ్యూల్ చేసింది.మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్ ను ఫిబ్రవరి 10వ తేదీకి రీ షెడ్యూల్ చేసింది. మిగిలిన మూడు దశలు యథాతథంగా ఉంటాయని ఎన్నికల సంఘం ప్రకటించింది.
also read:జగన్ ప్రభుత్వానికి షాక్: పంచాయతీ ఎన్నికలకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
undefined
ఇప్పటికే మొదటి విడత ఎన్నికల నిర్వహణకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇవాళ్టి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు.
నామినేషన్ పత్రాలు లేవని నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వారికి చాలా చోట్ల అధికారులు చెప్పారు. రాష్ట్రంలో చాలా చోట్ల నామినేషన్ల ప్రక్రియ జరగలేదు.సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రకారంగా ఎన్నికల నిర్వహణ చేయాల్సిందేనని తేల్చి చెప్పడంతో ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది.
ఈ నెల 8వ తేదీన ఎన్నికల షెడ్యూల్ ప్రకారంగా ఫిబ్రవరి 5,9, 13, 17 తేదీల్లో నాలుగు విడతల్లో ఎన్నికలు జరగాలి. కానీ, ఈ షెడ్యూల్ ను ఎన్నికల సంఘం రీ షెడ్యూల్ చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారంగా ఫిబ్రవరి 9,13,17, 21 తేదీల్లో పంచాయితీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 21న తొలి దశ ఎన్నికలు జరగనున్నాయి.
తొలి దశ పోలింగ్ కు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 29 నుండి ప్రారంభం కానుందని ఎన్నికల సంఘం తేల్చిచెప్పింది. ఫిబ్రవరి 21కి మారిన మొదటి దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.