
ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. ఇందుకు సంబంధించి రిజల్ట్ సైతం వచ్చేశాయి. తాజాగా రెండో విడత ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి.
ఈ నేపథ్యంలో రెండో దశ ఎన్నికల్లో జరిగిన ఏకగ్రీవాలను ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 539 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని ఈసీ స్పష్టం చేశారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 70 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
ఇక ప్రకాశం జిల్లాలో 69, విజయనగరం జిల్లాలో 60, కర్నూలు జిల్లాలో 57, నెల్లూరు జిల్లాలో 35, చిత్తూరు జిల్లాలో 62, శ్రీకాకుళం జిల్లాలో 41, కడప జిల్లాలో 40, కృష్ణా జిల్లాలో 36, విశాఖ జిల్లాలో 22, తూర్పుగోదావరి జిల్లాలో 17, పశ్చిమగోదావరి జిల్లాలో 15, అనంతపురం జిల్లాలో 15 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయని స్పష్టం చేసింది.
గుంటూరు జిల్లాకు సంబంధించి నర్సారావు పేట, వినుకొండ, చిలకలూరిపేట, సత్తెన పల్లి నియోజవకర్గాల్లోని 211 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 70 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి.
Also Read:ఆ పంచాయితీల ఫలితాలు తారుమారు...వైసిపి కుట్రలు: ఎస్ఈసీకి చంద్రబాబు లేఖ
వీటిలో నర్సారావు పేట నియోజకవర్గంలో మొత్తం 49 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.... 27 ఏకగ్రీవం అయ్యాయి. ఇక చిలకలూరి పేటలో 51 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.... 12 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి.
సత్తెనపల్లి నియోజకవర్గంలోని నకరికల్లు మండలంలో 17 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.... 7 చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. వినుకొండ నియోజకవర్గం పరిధిలోని 94 గ్రామాల్లో ఎన్నికలు జరుగుతుండగా.. వీటిలో 24 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి.